Kannappa : ‘కన్నప్ప’తో మరో మంచు వారసుడు ఎంట్రీ.. మోహన్ బాబు మనవడు రాబోతున్నాడు..

‘కన్నప్ప’తో మరో మంచు వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విష్ణు అనౌన్స్ చేశారు. మోహన్ బాబు మనవడు..

Kannappa : ‘కన్నప్ప’తో మరో మంచు వారసుడు ఎంట్రీ.. మోహన్ బాబు మనవడు రాబోతున్నాడు..

Manchu Vishnu son Avram acting debut with Kannappa movie

Updated On : January 5, 2024 / 4:22 PM IST

Kannappa : మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటించబోతుంది. మొదటి షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన ఈ చిత్ర యూనిట్.. అక్కడ 90 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు.

ఇక మొదటి షెడ్యూల్ కోసం సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. మంచు విష్ణు అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఈ సినిమాతో మరో మంచు వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు. మంచు కుటుంబం నుంచి మూడోతరం యాక్టర్‌గా మోహన్ బాబు మనవడు రాబోతున్నాడు. మంచు విష్ణు కొడుకు ‘అవ్రామ్’ ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉండే పాత్రని చేస్తున్నాడట.

ఈ చిత్రంలో తన కొడుకు నటిస్తునందుకు ఎంతో గర్వకారణంగా ఉందని మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ చిత్రం తన జీవితంలో ఎంతో ముఖ్యమైన, మంచు కుటుంబానికి సంబంధించిన మొత్తం మూడు తారలు ఈ చిత్రంలో కనిపించబోతున్నారని విష్ణు చెప్పుకొచ్చారు. మరి ఈ మూవీలో ‘అవ్రామ్’ ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడో చూడాలి.

Also read : Aamir Khan : మొదటి భార్య కూతురి పెళ్ళిలో.. రెండో భార్యతో ఆమిర్ స్టెప్పులు.. వీడియో వైరల్

కాగా ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా, పార్వతీ దేవిగా నయనతార నటించబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ ని ఇప్పటికే రాముడిగా చూసిన అభిమానులు.. శివుడిగా కూడా చూసేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ సెట్స్ లోకి ప్రభాస్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది..? అనే అప్డేట్ కూడా త్వరలోనే రానుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రీతి ముఖుందన్ నటిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.