Aamir Khan : మొదటి భార్య కూతురి పెళ్ళిలో.. రెండో భార్యతో ఆమిర్ స్టెప్పులు.. వీడియో వైరల్

మొదటి భార్య కూతురి పెళ్ళిలో రెండో భార్యతో కలిసి ఆమిర్ వేసిన స్టెప్పుల వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Aamir Khan : మొదటి భార్య కూతురి పెళ్ళిలో.. రెండో భార్యతో ఆమిర్ స్టెప్పులు.. వీడియో వైరల్

Aamir Khan dance with second wife in first wife daughter marriage

Aamir Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం.. ఈ బుధవారం జనవరి 3న ఘనంగా జరిగింది. తన ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో ఐరా ఖాన్ ప్రేమలోపడగా.. ఆ ప్రేమకి ఆమిర్ అంగీకారం తెలిపి దగ్గరుండి వివాహం జరిపించారు. ముంబయి బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది.

ఇక ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఒక వీడియోలో ఆమిర్ తన మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఆమిర్ ఖాన్ 1986లో ‘రీనా దత్తా’ అనే మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 2002లో విడాకులతో విడిపోయారు. ఇప్పుడు వివాహం చేసుకుంటున్న ఐరా ఖాన్.. ఆమిర్, రీనాకి పుట్టిన వారసురాలు. అలాగే ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చారు.

Also read : RC16 : రామ్‌చరణ్ సినిమాలో ఆ సూపర్ స్టార్ ముఖ్య పాత్ర.. ఎవరు ఆ హీరో..?

ఇక ఈ విడాకుల తరువాత 2005లో ‘కిరణ్ రావు’ అనే బాలీవుడ్ దర్శకనిర్మాతని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో ఈమెతో కూడా డివోర్స్ తీసుకున్నారు ఆమిర్ ఖాన్. వీరిద్దరికి ఒక బాబు పుట్టారు. కాగా ఇప్పుడు జరుగుతున్న మొదటి భార్య కూతురి పెళ్లి ఫంక్షన్ లో ఆమిర్.. తన రెండో భార్యతో కలిసి స్టెప్పులు వేశారు. వీరితో పాటు వీరిద్దరికి పుట్టిన కొడుకు కూడా డాన్స్ వేస్తూ కనిపించారు.

ఇక ఆ వీడియోలో ఆమిర్ తన మొదటి భార్య కొడుకుని డాన్స్ వేయడానికి పిలిచినా రాకపోతుంటే.. ఆమిర్ తన రెండో భార్యని తీసుకోని పెద్ద కొడుకు దగ్గరకి వెళ్లి డాన్స్ వేయడం కనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియో వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mrs. Ashu Sharma (@singer_ashusharma)

కాగా ఈ పెళ్ళికి సంబంధించిన రిసెప్షన్ ని రెండుసార్లు నిర్వహించనున్నారట. జనవరి 6 నుండి 10 తేదీల ఈ రిసెప్షన్స్ జరగనున్నాయట. వీటిలో ఒకటి ఢిల్లీలో, మరొకటి జైపూర్‌లో జరగబోతుందని సమాచారం.