RC16 : రామ్‌చరణ్ సినిమాలో ఆ సూపర్ స్టార్ ముఖ్య పాత్ర.. ఎవరు ఆ హీరో..?
రామ్‌చరణ్ సినిమాలో ఆ సూపర్ స్టార్ ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరని ఆలోచిస్తున్నారా..?

Kannada Super Star is playing important role in Ram Charan RC16
RC16 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ మూవీ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీలో నటించేందుకు నటీనటులు కావాలంటూ మేకర్స్ ఆడిషన్ కాల్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో కొన్ని ముఖ్య పాత్రలకు కొందరు స్టార్ల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి.
ఈక్రమంలోనే విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి స్టార్స్ పేర్లు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో పేరు వినిపిస్తుంది. ఒక సూపర్ స్టార్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారట. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరని ఆలోచిస్తున్నారా..? ఆయన మరెవరో కాదు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో ఆయనే తెలియజేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ మూవీ షూటింగ్ ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లో మొదలు పెట్టబోతున్నారు. వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల జాతీయ అవార్డు అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ఉత్తరాంధ్ర ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి నేపథ్యంలో జరగనుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.