Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
హైదరాబాద్ శివార్లలో జల్ పల్లి లో ఉన్న నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది.

Actor Mohan Babu
Mohan Babu : తాజాగా నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివార్లలో జల్ పల్లి లో ఉన్న నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. మోహన్ బాబు ఇంటి పనిమనిషి నాయక్ అనే వ్యక్తి ఆ ఇంట్లోంచి 10 లక్షల రూపాయలను దొంగలించి పారిపోయాడు.
Also Read : Harsha Sai : డబ్బుల కోసం ఆరోపణలు చేస్తున్నారు.. నా లాయర్ మాట్లాడతారు.. హర్ష సాయి పోస్ట్..
దీనిపై నిన్న రాత్రి రాచకొండ cpకి మోహన్ బాబు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ కేసులో వెంటనే స్పందించి తిరుపతిలో ఇవాళ ఉదయం మోహన్ బాబు ఇంటి పనిమనిషి నాయక్ ను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.