Nana Patekar : ఆ యువకుడిని అందుకే కొట్టాను.. నానా పటేకర్ వివరణ వీడియో..
నానా పటేకర్ యువకుడిపై చేయి చేసుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. చివరికి నానా ఈ విషయంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు.

Nana Patekar
Nana Patekar : ప్రముఖ నటుడు నానా పటేకర్ సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన యువకుడిని కొట్టారంటూ ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. మొత్తానికి ఈ ఘటనపై నానా పటేకర్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
Nana Patekar : సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న నటుడు.. నిజమెంత?
అనిల్ శర్మ డైరెక్షన్‌లో నానా పటేకర్ నటిస్తున్న మూవీ ‘జర్నీ’ షూటింగ్ వారణాశిలో జరుగుతోంది. షూటింగ్ సమయంలో తన దగ్గరకు వచ్చిన ఓ యువకుడిపై నానా చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో జనం నానాపై మండిపడ్డారు. దీనిపై ఆ సినిమా డైరెక్టర్ అనిల్ శర్మ కూడా స్పందించారు. నానా ఎవరినీ కొట్టలేదని అదంతా షూటింగ్‌లో భాగమని చెప్పారు. నానా తన దగ్గరకి వచ్చిన యువకుడి తలపై కొట్టాలని.. అక్కడ అదే జరిగిందంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఘటనపై నానా పటేకర్ వీడియో ద్వారా పూర్తి వివరణ ఇచ్చారు. యువకుడిని కొట్టిన మాట వాస్తవమేనన్నారు నానా పటేకర్. షూటింగ్ సీన్‌లో ఓ యువకుడిని కొట్టే షాట్ ఉందని.. అప్పటికే అది ఒకసారి రిహార్సల్ చేసామని చెప్పారు నానా. రెండోసారి తన దగ్గరకు వచ్చిన యువకుడు ఆ సీన్‌లో నటిస్తున్న యువకుడిగా పొరపాటు పడి అతనిని కొట్టానని నానా చెప్పారు. తర్వాత అతనెవరో తెలిసి క్షమాపణలు చెబుదామని ఎంత వెతికినా అతను అక్కడి నుండి పారిపోయి కనిపించలేదని నానా అన్నారు. సెల్ఫీ కోసం వచ్చిన ఎవరికి తనెప్పుడు నో చెప్పలేదని.. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని.. ఆ యువకుడు కనిపిస్తే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని నానా వీడియోలో వివరంగా చెప్పుకొచ్చారు.
Sara Ali Khan : సారా అలీఖాన్ ఫిట్‌నెస్ జర్నీ.. బాబోయ్ ఏం ఛేంజ్ ఓవర్..
నానా పటేకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేసారు. ‘సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా రాబోయే చిత్రం ‘జర్నీ’ నుండి ఒక షాట్ రిహార్సల్ సమయంలో అసలు ఏమి జరిగిందంటే?’ అనే శీర్షికతో ఆయన పోస్టు పెట్టారు. నెటిజన్లు మాత్రం ఆయనపై ఇంకా గరమ్ గరమ్‌గానే ఉన్నట్లు వాళ్లు చేస్తున్న కామెంట్లను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
View this post on Instagram