Nana Patekar : సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న నటుడు.. నిజమెంత?

నటుడు నానా పటేకర్ సెల్ఫీ దిగడానికి వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కెర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత?

Nana Patekar : సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న నటుడు.. నిజమెంత?

Nana Patekar

Updated On : November 15, 2023 / 5:26 PM IST

Nana Patekar : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు నటుడు నానా పటేకర్. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ నటి తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలు ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. తాజాగా నానా పటేకర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్నారంటూ ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇందులో వాస్తవమెంత?

Chiranjeevi : చిరంజీవి సినిమా డైరెక్ట్ చేయను అంటున్న డైరెక్టర్.. ఎందుకో తెలుసా..?

నటుడు నానా పటేకర్ అనిల్ శర్మ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా షూటింగ్‌లో భాగంగా యూపీలో ఉన్నారు. ‘జర్నీ’ అనే పేరుతో వస్తున్న ఈ మూవీలో ఉత్కర్ష్ శర్మ కూడా నటిస్తున్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ సమయంలో  అభిమాని సెల్ఫీ కోసం ఎగబడినట్లు నానా అతనిని కొట్టినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై చాలామంది నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియోపై డైరెక్టర్ అనిల్ శర్మ క్లారిటీ ఇచ్చారు. అది కేవలం తన సినిమాలోని సన్నివేశమని స్పష్టం చేశారు. ‘నానా ఎవరినీ కొట్టలేదు.. అది నా సినిమాలోని షాట్.. బనారస్ నడిబొడ్డున రోడ్డుపై షూట్ చేస్తున్నాం.. అక్కడ నానా తన దగ్గరకు వచ్చే అబ్బాయి తలపై కొట్టాలి.. ఈ సీన్ చేయడానికి నానా చాలా తంటాలు పడ్డారు’ అంటూ వివరణ ఇచ్చారు. నానా గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయవద్దని కూడా అనిల్ శర్మ రిక్వెస్ట్ చేశారు.

Harish Shankar : హిందూ ధర్మాన్ని విదేశీయులు గౌరవిస్తుంటే.. సొంత ప్రజలు విస్మరిస్తున్నారు.. మరోసారి హరీష్ శంకర్ సంచలన ట్వీట్

షూటింగ్ టైమ్‌లో గుమిగూడిన జనం తమ మొబైల్ నుంచి నానా పటేకర్ అబ్బాయిని కొడుతున్న సీన్ రికార్డ్ చేసి ఆ షాట్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో చాలామంది నెటిజన్లు నానాపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.