Naveen Chandra became father, naveen chandra wife orma blessed with baby boy
Naveen Chandra : పదేళ్ల క్రితం అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ప్రస్తుతం హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. తాజాగా నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Nani Vs Rana : నెపోటిజంపై కామెంట్స్.. నాని వర్సెస్ రానా.. నిజం విత్ స్మిత మూడో ఎపిసోడ్ రేపే..
ఇటీవలే వాలెంటైన్స్ డే రోజు తన భార్య ఓర్మా ప్రగ్నెంట్ అని ప్రకటించాడు నవీన్ చంద్ర. తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. తాజాగా నవీన్ చంద్ర బుధవారం రాత్రి తన బాబుని ఎత్తుకొని తన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడు. తన బాబుని ఎత్తుకున్న ఫోటోలని షేర్ చేసి.. నాకు, ఓర్మాకు అబ్బాయి పుట్టాడు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు నవీన్ చంద్రకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.