Nithin : ‘నాకు పెళ్లైంది.. నా డబ్బు నాకు రావాల్సిందే’ తండ్రిని ప్రశ్నించిన నటుడు

నితిన్ నటిస్తున్న ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ నుండి ముచ్చటగా మూడో సాంగ్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్‌లో తండ్రితో నితిన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Nithin

Nithin : నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, పాటలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో జరిగిన సరదా సన్నివేశం వైరల్ అవుతోంది.

Mahesh Babu : జిమ్‌లో పెంపుడు కుక్కతో కలిసి మహేష్ బాబు కసరత్తులు

నితిన్ లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా  ట్రైలర్, పాటలు జనాల్ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా మూడవ పాట ‘ఓలే ఓలే పాపాయి’ ని రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఈ పాట రిలీజ్ వేడుకలో నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ, నిర్మాత సుధాకర రెడ్డి పాల్గొన్నారు.

‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నిర్మిస్తున్న నిర్మాత సుధాకర రెడ్డి నితిన్ తండ్రి అనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో నితిన్‌తో అనేక సినిమాలు నిర్మించారాయన. అయితే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్‌కు తండ్రి రెమ్యునరేషన్ ఇస్తారా? ఇస్తే ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఇలా డౌట్స్ చాలామందికి ఉంటాయి. సరిగ్గా ఇదే డౌట్‌ని మూడవపాట రిలీజ్ ఈవెంట్‌లో అడిగారు ఓ జర్నలిస్టు. సినిమా రిలీజ్ తర్వాత ఇస్తానంటూ సమాధానం చెప్పారు సుధాకర్ రెడ్డి. వెంటనే మైక్ తీసుకున్న నితిన్ ‘ఇంతకు ముందు అయితే తనకు పెళ్లి కాలేదని.. ఇప్పుడు తనకు పెళ్లైందని.. తన డబ్బులు తనకు రావాల్సిందే అని’.. సరదాగా మాట్లాడి అందర్నీ నవ్వించారు.

Can you guess : ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టగలరా?

‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’  సినిమా దర్శకుడిగా వక్కంతం వంశీకి రెండవ సినిమా. నితిన్ కూడా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అటు శ్రీలీకు స్కంద, ఆదికేశవ సినిమాల కూడా ఆశించిన హిట్ ఇవ్వలేదు.  సో.. ముగ్గురికి ఈ సినిమా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.