టాలీవుడ్‌లో విషాదం.. హీరో తండ్రి క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో విషాదం.. హీరో తండ్రి క‌న్నుమూత‌

Actor Rahul Ravindran father passed away

Updated On : February 14, 2025 / 2:45 PM IST

టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. న‌టుడిగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ర‌వీంద్ర ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న తండ్రి ర‌వీంద్ర‌న్ న‌ర‌సింహ‌న్ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని రాహుల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నీతో గ‌డిపిన జ్ఞాప‌కాలు ఎన్న‌టికి నాలో బ‌తికే ఉంటాయ‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, నెటిజ‌న్లు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్టకాలంలో రాహుల్ రవీంద్రన్‌కు ధైర్యం చెబుతూ అండగా నిలుస్తున్నారు.

Brahmanandam : హాస్పిటల్ బెడ్ మీద.. చనిపోయేముందు ఎమ్మెస్ నారాయణ చివరి కోరిక.. వెంటనే షూటింగ్ నుంచి బ్రహ్మానందం..

 

View this post on Instagram

 

A post shared by Rahul Ravindran (@rahulr_23)

ఇంత‌టి విషాద స‌మ‌యంలో తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చి.ల.సౌ మూవీలోని ఓ డైలాగ్‌ను రాసుకొచ్చారు. నేను చి.ల‌.సౌఓ లైన్ రాశాను. కానీ అది ఇప్పుడు చాలా భినంగా క‌నిపిస్తోందన్నారు. నాన్నా ఉన్నారూ లే.. చూసుకుంటారు.. అనే మాట‌కి విలువ నాన్న‌ను కోల్పోయిన వారికి మాత్ర‌మే తెలుస్తుంది. అది ఈ రోజు నాకు అర్థ‌మైంది. తండ్రిలేని లోటు ఎన్న‌టికి పూడ్చ‌లేనిది. నిన్ను ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటాను నాన్న అంటూ భావోద్వేగానికి లోనైయ్యాడు.

Laila : ‘లైలా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో మెప్పించాడా?

అటు రాహుల్ భార్య ప్రముఖ సింగ‌ర్ చిన్మ‌యి సైతం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ భావోద్వేగానికి లోనైంది. త‌న‌కు ఎప్పుడూ స‌పోర్టుగా ఉండేవార‌ని చెప్పింది.