Raj tarun parents : హైడ్రామాకు తెర.. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య..
కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటి వద్దకు రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు వెళ్లడంతో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

actor raj tarun parents lavanyas kokapet house controversy
కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటి వద్దకు రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు వెళ్లడంతో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చివరికి రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య ఓకే చెప్పడంతో వివాదం సమసిపోయింది.
సూరారంలో ఉంటున్న రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరిలు అద్దె ఇంటిలో ఇబ్బంది పడుతున్నామని, తమ కొడుకు ఇంట్లో తాము ఉంటామని బుధవారం కోకాపేటకు వచ్చారు. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. ఆమె వారిని ఇంట్లోకి రానీవ్వకుండా అడ్డుకుంది.
పది మందితో కలిసి వచ్చి తన ఇంటిపై దాడి చేశారంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టులో ఉందని, పోలీసులతో మాట్లాడిన తరువాతనే ఇంట్లోకి రావాలని ఆమె తేల్చి చెప్పింది. తనపై దాడికి వచ్చారని లావణ్య ఆరోపించారు. దీంతో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఇంటి బయటే ఉండిపోయారు.
Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రివ్యూ.. ప్రేతాత్మ వర్సెస్ శివశక్తి..
లావణ్య తమ కోడలు కాదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అన్నారు. సహజీవనం చేసింది తప్పా పెళ్లి చేసుకోలేదన్నారు. తమ కొడుకు కష్టార్జీతంతో కొన్న ఇళ్లు ఇది అని, మా కొడుకు ఇంట్లో మేము ఉంటాం అంటూ వారు తెల్లవారుజాము వరకు బయటనే ఉండిపోయారు.
చివరకు నార్సింగి పోలీసులు రంగప్రవేశంతో కథ సుఖాంతమైంది. పోలీసులు లావణ్యతో మాట్లాడారు. ఆఖరికి రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య అనుమతి ఇచ్చింది. దీంతో వారు విల్లాలోకి వెళ్లారు.