Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రివ్యూ.. ప్రేతాత్మ వర్సెస్ శివశక్తి..

ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగితే పార్ట్ 2 ఆత్మ, దేవుడు అని సాగుతుంది.

Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రివ్యూ.. ప్రేతాత్మ వర్సెస్ శివశక్తి..

Tamannaah Sampath Nandi Hebah Patel Odela 2 Movie Review and Rating

Updated On : April 17, 2025 / 9:39 PM IST

Odela 2 Movie Review : ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘ఓదెల 2’. తమన్నా మెయిన్ లీడ్ లో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌ బ్యానర్ పై మధు నిర్మాణంలో సంపత్ నంది కథ, మాటలు అందించగా అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, శ్రీకాంత్ అయ్యంగార్, నాగ మహేష్, గగన్ విహారి, మురళి శర్మ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఓదెల 2 సినిమా నేడు ఏప్రిల్ 17న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. మొదటి పార్ట్ లో రాధ(హెబ్బా పటేల్) తన భర్త తిరుపతి(వసిష్ఠ సింహ)ని చంపేసి జైలుకు వెళ్ళడంతో ముగుస్తుంది. ఓదెల 2 అక్కడి నుంచే మొదలవుతుంది. తిరుపతి శవాన్ని కాల్చకుండా ఊరివాళ్లంతా కలిసి తిరుపతి శవానికి సమాధి శిక్ష వేయాలి అని, శవాన్ని నిలువుగా పూడ్చిపెట్టి ఆత్మ వెళ్లిపోకుండా, మోక్షం పొందకుండా ఉండేలా శిక్ష వేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ ఊరి వాళ్ళందరి మీద పగబడుతుంది. ఆరు నెలల తర్వాత ఊళ్లో పెళ్లిళ్లు జరగడం మొదలవుతాయి. మొదటి పార్ట్ లో డైరెక్ట్ గా తిరుపతి చేస్తే ఇప్పుడు తిరుపతి ఆత్మ వచ్చి శోభనం రోజు పెళ్లి కూతుళ్ళని చంపేస్తుంది. ఇదంతా తిరుపతి ఆత్మ వేరే వాళ్ళ శరీరాల్లోకి దూరం చేస్తుంది.

మొదట వేరే వాళ్ళే చేశారని పోలీసులు, ఊరివాళ్ళు వాళ్ళని కొడతారు. కానీ ఇదంతా తిరుపతి ఆత్మ చేసిందని తెలుస్తుంది. దీంతో తిరుపతి ఆత్మని ఏం చేయాలో తెలియక ఊరివాళ్ళు జైల్లో ఉన్న రాధ దగ్గరికి వెళ్తారు. రాధ తన అక్క భైరవి(తమన్నా) గురించి చెప్తుంది. భైరవి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి శివుడు మీద ఇష్టంతో శివశక్తుల్లో కలిసిపోతుంది. దీంతో ఓదెల ఊరివాళ్ళు భైరవిని కలిసి ఊరిని కాపాడమని అడుగుతారు. భైరవి ఓదెలని ఎలా కాపాడుతుంది? తిరుపతి ఆత్మ ఇంకెన్ని వినాశనాలు సృష్టిస్తుంది? రాధ జైలు నుంచి బయటకు వస్తుందా? తిరుపతి ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Pooja Hegde : ఫ్యామిలీ నుంచి నాకు ఆ ప్రెజర్ ఉంది.. పూజ హెగ్డే వ్యాఖ్యలు.. పెళ్లి గురించి కాదు.. మరేంటో తెలుసా?

సినిమా విశ్లేషణ.. ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగితే పార్ట్ 2 ఆత్మ, దేవుడు అని సాగుతుంది. సినిమా మొదట్లోనే తిరుపతి ఆత్మ వచ్చి ఇదంతా చేస్తుంది అని చూపించడంతో రెగ్యులర్ కథలాగే సాగుతుంది. ఇదంతా ఆత్మ చేస్తుందని ఊళ్ళో వాళ్లకు తెలిసిన దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి భైరవి ఎంట్రీ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో తిరుపతి చేసే వినాశనాన్ని చాలా గ్రాండియర్ గా చూపించారు. సెకండ్ హాఫ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని బాగానే నడుస్తుంది.

కానీ క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎమోషన్ బాగానే వర్కౌట్ అయినా, గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నా క్లైమాక్స్ ఇంకా బాగా చూపించొచ్చు అనిపిస్తుంది. అమ్మోరు, అరుంధతి లెవల్లో చూపించే ప్రయత్నం చేసారు. ఇటీవల దేవుడిని ప్రధానాంశంగా తీసుకొని చివర్లో దేవుడు రావడం చూపించి సినిమాకు హైప్ తెస్తున్నారు. ఇందులో కూడా చివర్లో నంది, శివుడు రావడం చూపించినా శివుడ్ని ఇంకా గొప్పగా చూపించొచ్చు అనిపిస్తుంది. అక్కడక్కడా భయపెట్టారు కూడా. తిరుపతి ప్రేతాత్మతో భైరవి ఫేస్ టూ ఫేస్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి. ఒక దుష్టశక్తిని దేవుడు సపోర్ట్ ఉన్న ఒక మహిళ ఎలా చంపింది అని గతంలో పలు సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలో కాస్త కొత్తగా గ్రాండ్ గా చూపించారు. ఈ సినిమాలోని శివత్వాన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేసుకుంటే నార్త్ లో బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

tamannaah

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలతో మెప్పించిన తమన్నా ఇందులో నాగసాధువుగా మొదటిసారి నటించినా పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అయింది. తన కెరీర్ లో ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. వశిష్ట నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడు. సినిమాకు వశిష్ట సింహ చాలా ప్లస్ అయ్యాడు. హెబ్బా పటేల్ కాసేపు కనిపించి ఓకే అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నాగ మహేష్, మురళి శర్మ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్ఫెక్ట్ గా మెప్పించారు.

Also Read : Yamadonga : ఎన్టీఆర్ ‘యమదొంగ’ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. అజనీష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ ని మరింత ఎలివేట్ చేసాడు. పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి. పార్ట్ 1 లాగే ఈ సినిమా కూడా రియల్ లొకేషన్స్ లోనే చాలా వరకు తెరకెక్కించారు. గ్రాఫిక్స్, VFX బాగానే డిజైన్ చేసినా క్లైమాక్స్ లో శివుడ్ని ఇంకా బాగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ పరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. కథ రెగ్యులర్ కథే అయినా కాస్త గ్రాండ్ గా రాసుకున్నారు సంపత్ నంది. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. డైరెక్టర్ అశోక్ తేజ ఓదెల పార్ట్ 1ని మించి దీన్ని బాగా తెరకెక్కించారు.

మొత్తంగా ‘ఓదెల 2’ సినిమా చనిపోయిన వ్యక్తి ఆత్మ ఊరి మీద పగబట్టి చంపేస్తుంటే నాగసాధువు భైరవి వచ్చి ఊరిని ఎలా కాపాడింది అని ఆత్మలు – దైవం అంటూ ఆసక్తిగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.