Pooja Hegde : ఫ్యామిలీ నుంచి నాకు ఆ ప్రెజర్ ఉంది.. పూజ హెగ్డే వ్యాఖ్యలు.. పెళ్లి గురించి కాదు.. మరేంటో తెలుసా?
పూజ హెగ్డే నటించిన సూర్య రెట్రో సినిమా మే 1న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కాబోతుంది.

Pooja Hegde says in Retro Promotions her Family giving Pressure
Pooja Hegde : తెలుగులో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ, స్టార్ హీరోల సరసన నటిస్తూ తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే స్టార్ హీరోల సినిమాలు, భారీ సినిమాలు చేస్తున్న పూజ సడెన్ గా తెలుగు సినిమాల నుంచి తప్పుకొని వెళ్ళిపోయింది. గత మూడేళ్ళుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం పూజ హిందీ, తమిళ్ సినిమాలు చేస్తుంది.
పూజ హెగ్డే నటించిన సూర్య రెట్రో సినిమా మే 1న తెలుగు, తమిళ్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా పూజ తెలుగులో పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో తన మీద ఉన్న ప్రెజర్ గురించి చెప్పింది.
Also Read : Mahesh – Rajamouli : మహేష్ వచ్చాడు.. రాజమౌళి రాగానే మొదలు.. ఈ సారి నో లీక్స్..
పూజ హెగ్డే మాట్లాడుతూ.. నాకు ఫ్యామిలీ, రిలేటివ్స్ నుంచి కన్నడలో సినిమా చేయాలని ప్రెజర్ ఉంది. నేను తుళు అమ్మాయిని, కర్ణాటక నుంచి వచ్చాను. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేశాను కానీ కన్నడలో సినిమాలు చేయలేదు. కన్నడ కథలు కూడా కొన్ని విన్నాను కానీ అంతగా కనెక్ట్ అవ్వలేదు. కన్నడ నుంచి మంచి కథ వస్తే చేద్దామని ఎదురుచూస్తున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అడుగుతున్నారు అని తెలిపింది.
దీంతో పూజ హెగ్డేని తన సొంత భాషలో ఒక సినిమా చేస్తే చూడాలని తన ఫ్యామిలీ, రిలేటివ్స్ కోరుకుంటున్నారని తెలుస్తుంది.
Also Read : Prabhas : ప్రభాస్ నుంచి.. ‘రాజా సాబ్’ కంటే ముందు ఆ సినిమానే వస్తుందట..