నువ్వొద్దమ్మా : తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన నటి సంగీత

అప్పటి హీరోయిన్, నటి అయిన సంగీత వ్యవహారం కోలీవుడ్ ను కుదిపేస్తోంది. తన ఇంట్లోనే ఇన్నాళ్లు ఉంటున్న కన్నతల్లిని..

  • Publish Date - April 13, 2019 / 05:32 AM IST

అప్పటి హీరోయిన్, నటి అయిన సంగీత వ్యవహారం కోలీవుడ్ ను కుదిపేస్తోంది. తన ఇంట్లోనే ఇన్నాళ్లు ఉంటున్న కన్నతల్లిని..

అప్పటి హీరోయిన్, నటి అయిన సంగీత వ్యవహారం కోలీవుడ్ ను కుదిపేస్తోంది. తన ఇంట్లోనే ఇన్నాళ్లు ఉంటున్న కన్నతల్లిని.. ఇప్పుడు బయటకు వెళ్లగొట్టింది. ఇంకెప్పుడు ఇంట్లోకి రావొద్దని.. ఈ చుట్టుపక్కల కనిపించొద్దని కూడా వార్నింగ్ ఇచ్చిందంట తల్లికి. దీనికి కారణం ఆస్తి గొడవలు అంటున్నారు. మూడు రోజులుగా భర్త క్రిష్ తో కలిసి మహిళా కమిషన్ ఎదుట హాజరవుతున్నది సంగీత.

ఏంటీ గొడవ అంటే :
తమిళనాడు రాష్ట్రం పెరంబూరులో నివాసం ఉంటుంది సంగీత. రెండు అంతస్తుల బిల్డింగ్ అది. ఏడేళ్ల క్రితం క్రిష్ తో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆ బిల్డింగ్ కింద సంగీత ఉంటే.. పైన తల్లి ఉంటుంది. సంగీత తమ్ముడితో కలిసి తల్లి నివసిస్తుంది. ఇటీవలే సంగీత తమ్ముడు చనిపోయాడు. ఆ తర్వాత నుంచి ఒంటరిగా ఉంటుంది. ఈ బిల్డింగ్ సంగీత పేరున ఉంది. కాకపోతే ఉమ్మడి ఆస్తిగా చెబుతున్నది తల్లి. ఈ ఇంట్లోనే తల్లి ఉంటే.. ఆస్తిలో వాటా కావాలని అన్న, ఇతరులు వచ్చే అవకాశం ఉందని భావించిన సంగీత.. తల్లిని ఇంటి నుంచి గెంటివేసినట్లు కంప్లయింట్ చేసింది తల్లి భానుమతి. ఈ వయస్సులో ఎక్కడి వెళ్లాలి అని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆమె.
Read Also : ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం ​​​​​​​

మహిళా కమిషన్ విచారణ :
వారం క్రితమే ఈ ఘటన జరిగింది. మహిళా కమిషన్ నోటీసులు అందుకున్న సంగీత.. మూడు రోజులుగా భర్తతో కలిసి విచారణకు హాజరవుతుంది. ఈ సమయంలో విషయం బయటకు వచ్చింది. తల్లిని బయటకు వెళ్లగొట్టిన అంశంపై మాట్లాడటానికి నిరాకరిస్తుంది. వ్యక్తిగత విషయాల జోలికి రావొద్దని.. ప్రశ్నిచ్చొద్దని అంటోంది. కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడతాను అంటోంది వెటరన్ బ్యూటీ. మొత్తానికి సంగీత ఆస్తి గొడవలు రొడ్డెక్కాయి. తల్లినే ఇంటి నుంచి గెంటేసిన వార్త మాత్రం వైరల్ అయ్యింది.

తల్లిపై తీవ్ర ఆరోపణలు కూడా చేస్తోంది సంగీత. అన్న, తమ్ముడికి డ్రగ్స్ అలవాటు చేసిందని.. వాళ్లను చెడగొట్టింది కూడా తన తల్లే అంటోంది. ఏది నిజమో.. ఏది అబద్దమో కమిషన్ తేల్చాలి.
Read Also : ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్