Actor Sumanth: నటీనటులు సుమంత్, మృణాల్ ఠాకూర్ గురించి ఓ వార్త ఫిలింనగర్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు వారిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృణాల్ తో పెళ్లి ప్రచారంపై సుమంత్ స్పందించారు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అసలు నిజం ఏంటో చెప్పేశారు. నటి మృణాల్ తో తన వివాహం అనే వార్తలను కొట్టిపారేశారు సుమంత్. ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేశారు. తన నెక్ట్స్ సినిమా ‘అనగనగా’ ప్రమోషన్స్‌లో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు సుమంత్.
”నేను సోషల్ మీడియాను ఉపయోగించను. అందుకే ఆ వార్తలు నా దృష్టికి రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో తాము ‘సీతారామం’ ప్రమోషన్స్ సమయంలో తీసుకున్నాం. అంతకుమించి ఏమీ లేదు. వివాహ బంధంలోకి మరోసారి అడుగుపెట్టే ఉద్దేశం నాకు లేనే లేదు” అని తేల్చి చెప్పారు సుమంత్.
Also Read: వామ్మో బాలయ్యకు అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారా? రజనీకాంత్ మూవీలో..
”నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. నాకు ఇలా ఉండటమే ఇష్టం. నా దినచర్య నాకు ఎప్పుడూ బోరింగ్‌గా అనిపించదు. నేను రోజుకు ఐదు గంటలు సినిమాలు చూస్తాను. లేదా OTT ప్లాట్‌ఫామ్‌లలో గడుపుతాను. ఆ తర్వాత జిమ్ చేస్తాను. స్పోర్ట్స్ ఆడతాను. వివాహం అనే ఆలోచన నాకు అస్సలు రాదు” అని నటుడు సుమంత్ అన్నారు.
నటు సుమంత్ కు ఇది వరకే పెళ్లైంది. కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే, కొంత కాలానికే వారు విడిపోయారు. సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా’. కాజల్ చౌదరి హీరోయిన్. సన్నీ కుమార్ డైరెక్టర్. ఈ సినిమాలో సుమంత్ టీచర్ గా నటించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడంతోపాటు చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే త్వరగా అర్థమవుతుందో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో చేశారట.