Balakrishna : వామ్మో బాల‌య్య‌కు అన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారా? ర‌జ‌నీకాంత్ మూవీలో..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న జైలర్ 2 మూవీలో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నార‌ని తెలుస్తోంది.

Balakrishna : వామ్మో బాల‌య్య‌కు అన్ని కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారా? ర‌జ‌నీకాంత్ మూవీలో..

Nandamuri Balakrishna Charging Whopping Amount Of 50 Crores For Jailer 2 Movie Says Reports

Updated On : May 11, 2025 / 12:48 PM IST

ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ సినిమా ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక తాజాగా ఈ చిత్ర రెండవ భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు. జైల‌ర్‌-2గా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. జైల‌ర్ మూవీలో క‌న్న‌డ నుంచి శివ‌రాజ్‌కుమార్‌, మ‌ల‌యాళం నుంచి మోహ‌న్ లాల్‌, బాలీవుడ్ నుంచి జాకీ షాప్ర్‌లు అతిథి పాత్ర‌లో కనిపించారు. ఇక రెండో భాగంలో టాలీవుడ్ నుంచి నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు అనే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Bhairavam : ‘భైర‌వం’ నుంచి ముగ్గురు హీరోల‌ మ‌ల్టీ స్టార‌ర్ సాంగ్ వ‌చ్చేసింది..

కాగా.. ఈ చిత్రం కోసం బాల‌య్య 20 రోజులు డేట్స్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం బాల‌య్య 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ అడిగార‌ని, ఇచ్చేందుకు నిర్మాత‌లు ఓకే చెప్పిన‌ట్లు టాక్‌. ఇందులో నిజం ఎంత ఉందో తెలియ‌దు గానీ ప్ర‌స్తుతం ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌వేళ ఇదే గ‌నుక నిజం అయితే మాత్రం బాల‌య్య కెరీర్‌లోనే అత్య‌ధిక పారితోషికం ఇదే కానుంది.

ఇదిలా ఉంటే.. బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.