Vidyut Jammwal
Vidyut Jammwal : ప్రముఖ నటుడు విద్యుత్ జమ్వాల్ ఒంటిపై నూలు పోకుండా లేకుండా హిమాలయాల్లో సేద తీరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఇంతకీ ఆ నటుడు అక్కడ ఏం చేస్తున్నట్లు?
Dharmendra : 2023 లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డియోల్ ఫ్యామిలీ
విద్యుత్ జమ్వాల్ రీసెంట్‌గా కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు షాకయ్యారు. ప్రకృతికి దగ్గరగా ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపించారు విద్యుత్ జమ్వాల్. ప్రకృతి ప్రేమికుడు అయిన ఈ నటుడు కొంతకాలం హిమాలయాల్లో గడపడం కోసం అక్కడ ఉన్నట్లు అర్ధమవుతోంది. విద్యుత్ జమ్వాల్ హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో శక్తి, బిల్లా 2, ఊసరవెల్లి సినిమాల్లో నటించారు. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ఇన్ స్ట్రక్టర్. ఇదంతా ఒకే కానీ జీవితం మీద విరక్తి కలిగిన వ్యక్తిలా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఈ నటుడు హిమాలయాల్లో ఎందుకు తిరుగుతున్నట్లు? అంటే..
విద్యుత్ జమ్వాల్ హిమాలయాల్లో ఒక యోగిలా కనిపించారు. తను పోస్టు చేసిన ఫోటోల్లో బట్టలు లేకుండా కూర్చున్నారు. ప్రకృతిలో వంట చేయడం, సూర్య నమస్కారాలు చేయడం వంటివి కనిపించాయి. ‘దైవ నివాసంలో తను ఉన్నానని.. ప్రతి సంవత్సరం 7-10 రోజులు హిమాలయాల్లో గడపడం తన జీవితంలో భాగమైందని’ విద్యుత్ జమ్వాల్ తన పోస్టులో చెప్పారు. ‘విలాసవంతమైన జీవితం నుండి అరణ్యానికి వచ్చినపుడు ఒంటరితనంలో తన గురించి తాను తెలుసుకునే అవకాశం దొరికిందని.. ప్రకృతి నిశ్శబ్దంలో తనను తాను తెలుసుకుంటానని’ రాసుకొచ్చారు. ‘కొద్దిరోజుల తర్వాత కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇంటికి తిరిగి వస్తానని.. ఏకాంతం అనేది అనూహ్యమైనదని.. అనుభవ పూర్వకంగా మాత్రమే తెలుస్తుందని.. మరోసారి అక్కడకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటానని’ తన పోస్టులో వివరించారు విద్యుత్ జమ్వాల్.
కాగా నటుడు విద్యుత్ జమ్వాల్ , ఆదిత్య దత్ కలిసి ‘క్రాక్’ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 23, 2024 న విడుదల కాబోతోంది.
My retreat to the Himalayan ranges – “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y
— Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023