Dharmendra : 2023 లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డియోల్ ఫ్యామిలీ

కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమవుతున్న డియోల్ ఫ్యామిలీకి 2023 బాగానే కలిసొచ్చింది. ధర్మేంద్రతో పాటు తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌కి 2023 బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పాలి.

Dharmendra : 2023 లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డియోల్ ఫ్యామిలీ

Dharmendra

Updated On : December 10, 2023 / 12:05 PM IST

Dharmendra : బాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఆయన తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లు కూడా తండ్రి లాగే నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కొన్నేళ్లుగా సరైన హిట్ పడక కాస్త వెనుకపడిన డియోల్ ఫ్యామిలీకి 2023 కలిసొచ్చిందని చెప్పారు. తండ్రీ, కొడుకులు ఈ ఏడాది హిట్ సినిమాల్లో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.

Naa Saami Ranga : ‘నా సామి రంగ’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అంటున్న నాగార్జున..

ధర్మేంద్ర అలుపెరగకుండా నటిస్తూనే ఉన్నారు. దాదాపుగా 300 వందల సినిమాల్లో నటించిన ధర్మేంద్ర 6 దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నారు. ఆయీ మిలన్ కి బేలా, కాజల్, ఫూల్ ఔర్ పత్తర్, ఆయే దిన్ బహర్ కే వంటి సినిమాలతో మొదలుపెడితే ఆయన సినీ ప్రస్థానం ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. 1990 ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ధర్మేంద్ర తనదైన నటనతో అలరిస్తూనే ఉన్నారు.

ధర్మేంద్ర తనయుల్లో పెద్దవాడైన సన్నీ డియోలో 1982 లో ‘బేతాబ్’ సినిమాతో అరంగేట్రం ఇచ్చారు. 80, 90 లలో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో ఘాయల్, ఘాతక్, హిమ్మత్, డర్, బార్డర్, గదర్ సక్సెస్ అందుకున్నాయి. 2001 లో వచ్చిన గదర్: ఏక్ ప్రేమ్ కథ అత్యధిక వసూళ్లు సాధించింది. ఇక ధర్మేంద్ర చిన్న కొడుకు బాబీ డియోల్ 1977 లో వచ్చిన ‘ధరమ్ వీర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. 1995 లో ‘బర్సాత్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి గుప్త్, సోల్జర్, బాదల్ , బిచ్చూ వంటి సినిమాల్లో నటించారు. ఇలా డియోల్ ఫ్యామిలీ సినిమా రంగంలో తమదనే స్ధానాన్ని సంపాదించుకున్నారు. అయితే కొంతకాలంగా వీరి కెరియర్ బాగా లేదనే చెప్పాలి. అలాంటి సమయంలో ఆ ఫ్యామిలీలో ముగ్గురు నటులకి 2023 బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది.

Vasanthi Krishnan Engagement : బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ నిశ్చితార్థం ఫొటోలు..

కరణ్ జోహార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ కహానీ’ ఈ ఏడాది జూలై 28 విడుదలైంది. రణ్ వీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ధర్మేంద్ర, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటించారు. 87 సంవత్సరాల వయసులో కూడా ధర్మేంద్ర ఎంతో చక్కగా నటించారు. ఇక బాబీ డియోల్ నటించిన గదర్ 2 కూడా ఈ ఏడాది ఆగస్టు 11 న విడుదలై థియేటర్లలో దుమ్ము దులిపేసింది. ఎవరూ ఊహించనంతగా గదర్ 2 సక్సెస్ సాధించింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్ డిసెంబర్ 1 న విడుదలైంది. ఈ సినిమా బాబీ డియోల్‌కి తిరిగి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. రణ్ బీర్ కపూర్‌కి బాబీ డియోల్ బద్ధ శత్రువుగా నటించారు. కొంతకాలంగా తమ ఖాతాలో సరైన హిట్ పడలేదని కాస్త డల్‌గా ఉన్న డియోల్ ఫ్యామిలీ 2023 ఇచ్చిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.