Adah Sharma : అదా శర్మ అసలు పేరేంతో తెలుసా? మరీ ఇంత పొడవుగా ఉందే..
చాలామందికి కొసరు పేర్లతో అసలు పేర్లు మరుగున పడిపోతాయి. సెలబ్రిటీలైతే స్క్రీన్ కోసం తమ పేరును షార్ట్ చేసుకుంటారు.. మార్చేసుకుంటారు. నటి అదా శర్మ అసలు పేరు మీకు తెలుసా?

Adah Sharma
Adah Sharma : ‘ది కేరళ స్టోరీ’ చూసిన తర్వాత అదా శర్మ పేరు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అదా శర్మ తెలిసింది సరే.. ఆమె పూర్తి పేరేంటో తెలుసా? తెలిస్తే ఆశ్యర్యపోతారు.
Mrunal Thakur : టాలీవుడ్‌కి కోడలుగా మృణాల్ ఠాకూర్.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్..
‘ది కేరళ స్టోరి’ సినిమాతో అదా శర్మ చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రజలు తనను అదా అని గుర్తించినప్పటికీ అది తన అసలు పేరు కాదని రీసెంట్‌గా అదా శర్మ వెల్లడించారు. ఒక యూట్యూబర్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో తన అసలు పేరు చాలా పొడవుగా ఉంటుందని చెప్పారు. అదా శర్మ అసలు పేరు ‘చాముండేశ్వరి నరసింహన్ సుందరేశన్ అయ్యర్’ అట. తన పేరు మార్చుకోవడానికి కారణం ఏంటంటే? అంత పొడవైన పేరు అందరికీ చెప్పడం కష్టంగా ఉండటంతో అదాగా మార్చుకున్నారట.
Indian 2 : భారతీయుడు వచ్చేస్తున్నాడు.. కమల్ పుట్టినరోజు కంటే ముందే ఫ్యాన్స్‌కి గిఫ్ట్..
అదా శర్మ 2008 లో ‘1920’ అనే బాలీవుడ్ హారర్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో హార్ట్ అటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం వంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కమాండో వెబ్ సిరీస్‌లో బావనా రెడ్డి పాత్రలో అలరించారు.
View this post on Instagram