Alia Bhatt : మొన్న రష్మిక.. నేడు అలియా భట్.. ఆగని డీప్ ఫేక్ వీడియోలు

రష్మిక, సారా .. ఇప్పుడు అలియా భట్.. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోతోంది.

Alia Bhatt : మొన్న రష్మిక.. నేడు అలియా భట్.. ఆగని డీప్ ఫేక్ వీడియోలు

Alia Bhatt

Alia Bhatt : కొద్దిరోజుల క్రితం నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత మరికొందరు సెలబ్రిటీల దీని బారిన పడ్డారు. తాజాగా నటి అలియా భట్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు.

Deepfake : డీప్‌ఫేక్‌పై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధవుతున్న కేంద్రం

కొద్దిరోజుల క్రితం AI యూజ్ చేసి రష్మిక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ షాకయ్యారు. ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్‌గా ఆ తర్వాత అందరికి అర్ధమైంది. ఇక ఆ వీడియోపై అమితాబ్ బచ్చన్ చిరంజీవి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కవిత, నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా స్పందించారు. ఈ ఘటనపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

Sara Tendulkar : సారా టెండూల్క‌ర్ ఆవేద‌న‌.. నా డీప్‌ఫేక్ ఫోటోలు వైర‌ల్ చేస్తున్నారు

ఈ ఘటన జరిగిన తర్వాత మార్ఫింగ్ వీడియోలు పోస్టింగ్ కట్టడి కాలేదని చెప్పాలి. వరుసగా కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కాజోల్, సారా టెండూల్కర్‌లు దీని బారిన పడ్డారు. ఇప్పుడు నటి అలియా భట్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అలియా భట్‌ను బోల్డ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. వీడియో చూడగానే మనకు ఫేక్ వీడియో అని అర్ధమవుతుంది.  వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై అలియా భట్ స్పందించాల్సి ఉంది. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.