Deepfake : డీప్‌ఫేక్‌పై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధవుతున్న కేంద్రం

Deepfake Threat : టెక్నాలజీ సాయంతో నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి.. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి.

Deepfake : డీప్‌ఫేక్‌పై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధవుతున్న కేంద్రం

Deepfake Threat (Photo : Google)

డీప్ ఫేక్.. అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పదం. ప్రముఖులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు దుమారం రేపుతున్నాయి. సెలెబ్రిటీలే టార్గెట్ గా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. డీప్ ఫేక్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందాన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీంత డీప్ ఫేక్ ను కట్టడి చేయాల్సిందే అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

డీప్ ఫేక్ పై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి కట్టడికి ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తోంది కేంద్రం. డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి కట్టడికి అవసరమైతే తాము కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రేపు, ఎల్లుండి సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ఐటీ శాఖ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.

Also Read : ఎయిర్‌టెల్ యూజర్లు సాధారణ సిమ్‌కు బదులుగా ఇ-సిమ్ కార్డులు తీసుకోండి.. ఎందుకంటే?

”సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బలమైన సాధనమే అయినప్పటికీ.. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి.. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి. డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారాన్ని అరికట్టేందుకు ఇప్పటికే కొన్ని ఐటీ నిబంధనలు తీసుకొచ్చాం” అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

Also Read : 10ఏళ్లలో మీ ఆధార్ వివరాలను అసలు అప్‌డేట్ చేయలేదా? ఈ తేదీవరకే ఉచితం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!