తీవ్ర విషాదంలో అమలా పాల్

కథానాయిక అమలా పాల్ ఇంట విషాదం నెలకొంది..

  • Publish Date - January 22, 2020 / 08:04 AM IST

కథానాయిక అమలా పాల్ ఇంట విషాదం నెలకొంది..

ద‌క్షిణాది హీరోయిన్ అమ‌లాపాల్ ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి పాల్ వ‌ర్గీస్ మంగ‌ళ‌వారం రాత్రి క‌న్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు.
గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

త‌ను న‌టించిన సినిమా ‘అదో అంద ప‌ర‌వైపోల‌’ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చెన్నైలో ఉన్న అమ‌లా పాల్ తండ్రి మ‌ర‌ణ వార్త తెలియ‌గానే హుటాహుటిన కేర‌ళలోని తన స్వస్థలమైన కొచ్చికి చేరుకున్నారు.

Read Also : ఆర్య 3 స్క్రిప్ట్ రెడీ – బన్నీ వింటే సెట్స్‌కెళ్లిపోడమే!

కేరళలోని కురుప్పంపాడిలోని సెయింట్‌ పౌల్‌ క్యాథలిక్‌ చర్చిలో మధ్యాహ్నం 3, 4 గంటల ప్రాంతంలో ఆమె తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయి. పాల్ వ‌ర్గీస్‌కి భార్య అన్నిస్ పాల్‌, పిల్ల‌లు అమ‌ల‌, అభిజీత్‌లున్నారు..