VS11 : దాస్ గాడి గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా..? కోపంగా చూస్తున్న ర‌త్న‌మాల‌.. ఏమై ఉంటుంది..?

ధ‌మ్కీ సినిమా స‌క్సెస్‌తో జోష్‌లో ఉన్నాడు టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో VS11 వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న చిత్రంలో విశ్వ‌క్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగ‌మ్మ‌యి అంజ‌లి న‌టిస్తోంది.

VS11 : దాస్ గాడి గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా..? కోపంగా చూస్తున్న ర‌త్న‌మాల‌.. ఏమై ఉంటుంది..?

Actress Anjali as Rathnamala

Updated On : June 16, 2023 / 6:02 PM IST

‘ధ‌మ్కీ’ సినిమా స‌క్సెస్‌తో జోష్‌లో ఉన్నాడు టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen). దీంతో వ‌రుస‌గా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. అందులో సితార ఎంటర్ టైన్మెంట్ బ్యాన‌ర్‌లో న‌టిస్తున్న సినిమా ఒక‌టి. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో VS11 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి సంద‌ర్భంగా తెలుగోడి ఆత్మ‌గౌర‌వం అంటూ సినిమాలోని విశ్వ‌క్ లుక్‌ను చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. షార్ట్ హెయిర్ తో, గడ్డం మీసాలు, లుంగీ, నోటిలో బీడీతో పక్కా మాస్ లుక్ లో క‌నిపించాడు.

కాగా.. ఈ సినిమాలో తెలుగ‌మ్మాయి అంజ‌లి(Anjali) న‌టిస్తోంది. ఈ రోజు(జూన్ 16న‌) ఆమె పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిత్రంలోని ఆమె లుక్‌ను ఓ పోస్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఇంటి బ‌య‌ట అంజ‌లి కూర్చోని జ‌ట్టును ముడివేసుకుంటూ చాలా సీరియ‌స్‌గా క‌నిపిస్తోంది. ఈ సినిమాలో అంజ‌లి ర‌త్న‌మాలగా క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో అంజ‌లి చాలా ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లుగా ఈ పోస్ట‌ర్ ద్వారా అర్థం అవుతోంది.

Adipurush review : నిరాశ‌ప‌రిచింది.. భారీ గంద‌ర‌గోళాన్ని సృష్టించింది.. అంచ‌నాల‌ను అందుకోలేదు

గ‌త కొన్నాళ్లుగా అంజ‌లికి స‌రైన హిట్ ప‌డ‌డం లేదు. త‌మిళంలో కూడా దాదాపుగా అలాగే ఉంది. అయితే ఓటీటీల్లో మాత్రం దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం అంజ‌లి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక‌టి విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తున్న VS11 చిత్రం ఒక‌టి కాగా.. మ‌రొక‌టి శ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంబినేష‌న్ తెర‌కెక్కుతున్న ‘గేమ్ ఛేంజ‌ర్’. ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అంజ‌లి బ‌ర్త్ డే సంద‌ర్భంగా గేమ్ ఛేంజ‌ర్ చిత్ర బృందం కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. బ్లాక్ సూట్ వేసుకున్న అంజ‌లి ఫైల్స్ చేతిలో పట్టుకొని చాలా క్యూట్‌గా కనిపిస్తోంది.

Al Pacino : అత‌డికి 83.. ఆమెకు 29.. నాలుగో సారి తండ్రైన హాలీవుడ్ న‌టుడు.. ఆ చిన్నారికి ఏ పేరు పెట్టారంటే..?