Chandini Chowdary : హీరోయిన్ చాందిని చౌద‌రికి గాయం.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న తెలుగ‌మ్మాయి..

'కుందనపు బొమ్మ' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది తెలుగమ్మాయి చాందిని చౌద‌రి.

Actress Chandini Chowdary injury so she takes key decision

షార్ట్ ఫిలిమ్స్‌తో గుర్తింపు తెచ్చుకుని ‘కుందనపు బొమ్మ’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది తెలుగమ్మాయి చాందిని చౌద‌రి. వ‌రుస‌గా సినిమాలు, సిరీస్ చేస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాల‌లో న‌టిస్తూ త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. చాందిని గాయ‌ప‌డింది. గాయాన్ని నిర్ల‌క్ష్యం చేస్తూ రావ‌డంతో దాని తీవ్ర‌త పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తెలుగ‌మ్మాయి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

గ‌త కొన్నాళ్లుగా నేను సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. కొన్ని నెల‌ల క్రితం నాకు ఓ గాయ‌మైంది. అయితే.. దాని తీవ్ర‌త‌ను నేను అర్థం చేసుకోలేక‌పోయాను. షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ఫ‌లితంగా ఆ గాయం తీవ్ర‌త పెరిగింది.

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?

నేను షూటింగ్‌ల‌కు వెళ్తుంటే ఆ గాయం మ‌రింతగా బాధించ‌డం ప్రారంభించింది. దీంతో ఇప్పుడు నేను అన్నింటికి దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యం తీసుకున్నాను. మ‌ళ్లీ ఆరోగ్యం కుదుట‌ప‌డిన త‌రువాత సోష‌ల్ మీడియాకి తిరిగి వ‌స్తాను అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చాందిని చౌద‌రి రాసుకొచ్చింది.

ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా న‌టిస్తున్న చిత్రంలో చాందిని ఓ స్పెష‌ల్ రోల్ చేస్తోంది. ఇటీవ‌లే ఆమె లుక్‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం గాయం కార‌ణంగా షూటింగ్స్‌, సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యాన్ని చాందిని తీసుకుంది.

Devara OTT Release : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ‘దేవ‌ర‌’.. ఏ రోజు, ఎందులో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?