Genelia : ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోల్స్.. రిప్లై అదిరిందిగా..
అర్భాజ్ ఖాన్ ‘పించ్ 2’ లో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి రియాక్ట్ అయ్యింది జెనీలియా..

Genelia
Genelia: బొమ్మరిల్లు సినిమాలో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన జెనిలియా బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై వైవాహిక జీవితంలో భర్త పిల్లలతో బిజీగా ఉంది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
Actress Genelia : మా ఆయన 8 సార్లు నా కాళ్లు పట్టుకున్నాడు-జెనీలియా
ఇక రీసెంట్‌గా జెనీలియా గురించి ఓ నెటిజన్ కామెంట్స్ చెయ్యడం.. ఆమె అతనికి ఇచ్చిన రిప్లై గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ‘పించ్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పించ్’ సీజన్ 2 జరుగుతోంది. ఈ షోకి జెనీలియా అటెండ్ అయ్యింది. ఈ షో లో అర్భాజ్ ఓ వీడియోను జెనీలియాకి చూపించాడు. ఆ వీడియోలో హోలీని సెలబ్రేట్ చేసుకుంటుండగా.. జెనీలియా భర్త చేతులను మరో నటి ప్రీతి జింటా ముద్దాడింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై కొందరు ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోల్ చేశారు.
అయితే ఆ వీడియోలో ప్రీతి జింటా, రితేష్‌ను ముద్దు పెట్టుకుంటుంటే జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. ఈ వీడియోను ‘పించ్’ షోలో ప్లే చేసి చూపించిన అర్భాజ్.. ‘వల్గర్ ఆంటీ.. సిగ్గులేదా.. ఎప్పుడూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటావ్.. నీ ఫేస్‌కది సూట్ అవ్వదు’ అనే కామెంట్స్ చదివి వినిపించాడు. దీంతో జెనీలియా.. పాపం అతని ఫ్యామిలీలో పరిస్థితులు బాలేదనుకుంటా.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను’ అని రిప్లై ఇచ్చింది. పాపులారిటీ ఉన్నవారి మీద ఇలాంటి విమర్శలు మామూలే.. పెద్దగా పట్టించుకోనక్కర్లేదంటూ జెనీలియా భర్త రితేష్ చెప్పుకొచ్చారు.
View this post on Instagram