Actress Hema
Actress Hema : సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ తీసుకుందని ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళొచ్చింది. తాజాగా ఆ కేసులో హేమ ఎలాంటి తప్పు చేయలేదని కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హేమ 10 టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా పలు అంశాలపై మాట్లాడింది.(Actress Hema)
అయితే హేమ గత కొన్నాళ్ళుగా సినిమాలు తగ్గించేసింది. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఆరోపణలు కూడా హేమకు అవకాశాలు తగ్గేలా చేసాయి. సినిమాల్లో ఎక్కువగా కనపడకపోవడంపై హేమ స్పందించింది.
Also Read : Actress Hema : మొత్తం ఆ గొట్టం గాడే చేసాడు.. విష్ణు బాబుకి ఫోన్ చేసి.. ‘మా’ లో మెంబర్షిప్ పై హేమ వ్యాఖ్యలు..
హేమ మాట్లాడుతూ.. ఈ కేసు వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయింది. అవకాశాలు తగ్గాయి. సినిమా సెలబ్రిటీ అని ఎక్కువ ప్రచారం అయింది. అయితే అప్పటికే నేను కొంత యాక్టింగ్ తగ్గించాను. నేనే గ్యాప్ తీసుకున్నాను. 36 ఏళ్లుగా యాక్ట్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ కోసం పని చేశాను. 14 ఏళ్ళ నుంచి నటిస్తున్నాను. ఒకానొక సమయంలో డిప్రెషన్ కి వెళ్ళాను. రొటీన్ లైఫ్ అయిపొయింది. నా ఇంట్లో కూడా నాకు గుర్తింపు లేదు. కూతురు, భర్త, అమ్మ ప్రేమగా మాట్లాడటం, తిన్నావా, థ్యాంక్స్ చెప్పడం, అడగటం లాంటివి లేవు. నేను ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు వస్తాను అని అందరూ ప్రశ్నించేవాళ్ళు. ఓ సమయంలో నేను డిప్రెషన్ కి వెళ్ళిపోయాను.
నా గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు బిజీగా ఉండి. అందుకే నా కోసం నేను బతకాలి అనిపించింది. నన్నెవరూ ప్రశ్నించకూడదు అనుకున్నాను. అందుకే అందరికి దూరంగా ఉండాలని బిగ్ బాస్ కి వెళ్ళాను. డిప్రెషన్ లో ఉన్నప్పుడే బిగ్ బాస్ కి వెళ్ళాను. బిగ్ బాస్ షోతో నేను హ్యాపీ. నాకు మంచి గ్యాంగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మంచి పాత్రలు ర్వాట్లేదు. చిన్న చిన్నవి ఎందుకు చేయడం అనుకున్నా. ఇప్పుడు ఉన్నది చాలు అని రిలాక్స్ అయ్యాను. అలా అని మొత్తానికి సినిమాలు మానేయలేదు. మంచి పాత్రలు ఉంటే కచ్చితంగా చేస్తాను. ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి నేను ధైర్యంగా ఇప్పుడు అడుగుతాను ఛాన్సులు. నా అభిమానుల కోసం అయినా నేను మళ్ళీ యాక్ట్ చేస్తాను అని తెలిపింది.
Also Read : Sivaji Raja : నేను చనిపోయేదాకా బీజేపీనే.. పొలిటికల్ కెరీర్ గురించి శివాజీరాజా వ్యాఖ్యలు..