Actress Hema : మొత్తం ఆ గొట్టం గాడే చేసాడు.. విష్ణు బాబుకి ఫోన్ చేసి.. ‘మా’ లో మెంబర్షిప్ పై హేమ వ్యాఖ్యలు..
ఈ ఇంటర్వ్యూలో హేమ మా మెంబర్షిప్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.(Actress Hema)
Actress Hema
Actress Hema : సీనియర్ నటి హేమ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ తీసుకుందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈ కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఆ కేసు వల్ల హేమ మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) లో మెంబర్షిప్ కొన్నాళ్ళు సస్పెండ్ కూడా చేసాడు. తాజాగా ఆ కేసులో కోర్ట్ హేమకు క్లీన్ చిట్ ఇచ్చింది.(Actress Hema)
ఈ నేపథ్యంలో హేమ 10 టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో హేమ మా మెంబర్షిప్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
హేమ మాట్లాడుతూ.. మీడియా చేసిన హడావిడికి ‘మా’లో ఉన్న కొంతమంది చేసిన పని అది. శివబాలాజీ కింద ఉన్న ఓ వ్యక్తి ఇచ్చారు నోటీసు. విష్ణు బాబు అప్పుడు షూటింగ్ లో ఉంటే నేను డ్రగ్స్ తీసుకున్నాను, అరెస్ట్ చేసారు అని ఏదేదో చెప్పారు విష్ణుకి. ఇక్కడ ఏం జరుగుతుందో విష్ణుకి తెలీదు. వీళ్ళు ఏం చెప్తే అదే నమ్మే పరిస్థితి. విష్ణు బాబు లేకుండానే నన్ను సస్పెండ్ చేసి నోటీసులు పంపారు.
కానీ విష్ణు వచ్చాక నేను కలిసి మాట్లాడాను. విష్ణు బాబు సపోర్ట్ చేసారు. నిజం తేలేదాకా నిందలు వేయొద్దు అన్నారు. కోర్ట్ తీర్పు వచ్చేదాకా చూడండి. వచ్చాక నిజం అయితే నా కార్డు మొత్తానికే తీసేయండి అని విష్ణుతో చెప్పాను. ఇదంతా ‘మా’లో ఉన్న ఒక గొట్టం గాడు చేసాడు. ఆ గొట్టం గాడు ఎవడో తెలిసింది. వాడే మా లో న్యూస్ లీక్ చేసి రెచ్చగొట్టి మీడియాలో నా మీద నెగిటివ్ చేసింది. వాడే నా మెంబర్షిప్ సస్పెండ్ అయ్యేలా చేసింది. కానీ తర్వాత విష్ణు నాకు ‘మా’ కార్డు తిరిగి ఇచ్చారు అని తెలిపింది. కానీ ఇదంతా చేసిన ఆ గొట్టం గాడు ఎవరో మాత్రం చెప్పలేదు.
Also Read : Samantha : సమంత రెండో పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ? అందరూ అనుకున్నట్టు అతనితోనే..
