Samantha : సమంత రెండో పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ? అందరూ అనుకున్నట్టు అతనితోనే..

సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు తో ప్రేమలో ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. (Samantha)

Samantha : సమంత రెండో పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ? అందరూ అనుకున్నట్టు అతనితోనే..

Samantha

Updated On : December 1, 2025 / 9:04 AM IST

Samantha : తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ 2021 లో ఆ జంట విడిపోయారు. తర్వాత నాగచైతన్య ఇటీవలే శోభితని పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం ఆరోగ్య సమస్యలు అని సినిమాలకు కూడా కాస్త దూరంగానే ఉండి తన బిజినెస్ లు డెవలప్ చేసుకుంటుంది.(Samantha)

అయితే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు తో ప్రేమలో ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అనేకమార్లు ఈ ఇద్దరూ కలిసి కనిపించారు. రాజ్ నిడుమోరుతో ఉన్న ఫోటోలను సమంత కూడా స్వయంగా పోస్ట్ చేసింది. వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. రాజ్ నిడిమోరు భార్య కూడా తన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వీరిపై ఇండైరెక్ట్ గా పెట్టింది. దీంతో సమంత – రాజ్ నిడిమోరు డేటింగ్ చేస్తున్నారని అంతా ఫిక్స్ అయ్యారు.

Also Read : Sivaji Raja : నా తప్పేం లేదు.. అందుకే ‘అమృతం’ నుంచి తప్పుకున్నాను.. పాపం ఈయనకు ఆ విషయమే తెలీదంట..

తాజాగా సమంత పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత – రాజ్ నిడిమోరు నేడు డిసెంబర్ 1న కోయంబత్తూరు లోని ఇషా ఫౌండేషన్ లో సద్గురు ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వీరి పెళ్లి గురించి నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సమంత అధికారికంగా చెప్తుందో లేదో తెలీదు.

విడాకుల తర్వాత సమంత ఎక్కువగా ఇషా ఆశ్రమంలో గడుపుతుంది, అక్కడి భైరవి అమ్మవారికి పూజలు చేస్తుంది. సద్గురుతో మంచి అనుబంధం ఏర్పడింది. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో ఇషాకు వెళ్లిన ఫొటోలు షేర్ చేస్తుంది. ఇషాతో ఉన్న అనుబంధం కారణంగానే రాజ్ నిడిమోరుతో అక్కడ పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

Also Read : Actress Hema : పార్టీలోకి రమ్మని జగనన్న పిలిచాడు.. త్వరలోనే పవన్ కళ్యాణ్ ని కలుస్తాను.. చచ్చేలోపు నా టార్గెట్ అదే..