Sivaji Raja : నేను చనిపోయేదాకా బీజేపీనే.. పొలిటికల్ కెరీర్ గురించి శివాజీరాజా వ్యాఖ్యలు..

10 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా పాలిటిక్స్ గురించి, తన పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు. (Sivaji Raja)

Sivaji Raja : నేను చనిపోయేదాకా బీజేపీనే.. పొలిటికల్ కెరీర్ గురించి శివాజీరాజా వ్యాఖ్యలు..

Sivaji Raja

Updated On : December 1, 2025 / 10:36 AM IST

Sivaji Raja : సీనియర్ నటుడు శివాజీ రాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. శివాజీ రాజా గతంలో పొలిటికల్ పరంగా కూడా కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడా కనపడలేదు.(Sivaji Raja)

తాజాగా 10 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా పాలిటిక్స్ గురించి, తన పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు.

Also Read : Actress Hema : మొత్తం ఆ గొట్టం గాడే చేసాడు.. విష్ణు బాబుకి ఫోన్ చేసి.. ‘మా’ లో మెంబర్షిప్ పై హేమ వ్యాఖ్యలు..

శివాజీ రాజా మాట్లాడుతూ.. ఇటీవల నన్ను చాలా మంది అడుగుతున్నారు యాక్టివ్ గా లేను అని. రీసెంట్ గా సెంట్రల్ మినిస్టర్ కూడా మా మదర్ ని అడిగారు శివాజీ రాజా గతంలో యాక్టివ్ గా ఉండేవాడు ఇప్పుడు లేడేంటి అని. 30 ఏళ్ళ క్రితం కృష్ణం రాజు గారు మొదటిసారి MP గా పోటీ చేసినప్పుడు నా పక్కన ఉండు అని నన్ను బీజేపీలో జాయిన్ చేసారు. అప్పుడు నా చేతిలో చాలా సినిమాలు ఉన్నా వదిలేసి వెళ్ళాను.

తర్వాత జీవిత కూడా బీజేపీ లోనే మళ్ళీ జాయిన్ చేసింది. ప్రపంచంలో ఎవడైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తాడేమో కానీ నేను మాత్రం చనిపోయేదికా బీజేపీనే. నేను RSS నుంచి వచ్చాను. నాకు ఆ భావాలు ఇష్టం. ఇప్పటికి ఎప్పటికీ నేను బీజేపీనే అని అన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం లేదు అన్నారు. మరి భవిష్యత్తులో అయినా బీజేపీ కోసం బయటకు వచ్చి ప్రచారం చేస్తారేమో చూడాలి.

Also Read : Sivaji Raja : నా తప్పేం లేదు.. అందుకే ‘అమృతం’ నుంచి తప్పుకున్నాను.. పాపం ఈయనకు ఆ విషయమే తెలీదంట..