Jaya Prada : సినీ న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట్లో తీవ్ర విషాదం..

న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Actress Jaya Prada elder brother Raja Babu passes away

సినీ న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోద‌రుడు రాజా బాబు హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా జ‌య‌ప్ర‌ద‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తూ ఎమోష‌న్ అయింది.

‘నా అన్నయ్య రాజా బాబు మరణవార్తను మీకు తెలియజేయడానికి ఎంతో బాధగా ఉంది. ఆయన ఈరోజు (గురువారం)మధ్యాహ్నం 3:26 గంటలకు హైదరాబాద్‌లో మరణించారు. దయచేసి ఆయ‌న గురించి ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలో చెబుతాను.’ అంటూ జ‌య‌ప్ర‌ద ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

Sabdham : ‘శబ్దం’ మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

ఈ విష‌యం తెలిసిన ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Hari Hara Veera Mallu : ఓవైపు త‌గ్గ‌ని కుర్ర హీరోలు.. హరిహర వీరమల్లు నిర్మాత‌ల మాస్ట‌ర్ ప్లాన్ అదేనా?

సినీ న‌టిగా 14 ఏళ్ల‌కే జ‌య‌ప్ర‌ద త‌న కెరీర్‌ను ప్రారంభించింది. 1976 నుంచి 2005 మ‌ధ్య కాలంలో ఆమె 300 పైగా చిత్రాల్లో న‌టించారు. 1994లో ఆమె రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు. మొద‌ట తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ త‌రువాత స‌మాజ్‌వాదీ పార్టీలో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తున్న ‘ఫౌజీస‌లో మూవీలో జ‌య‌ప్ర‌ద ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.