Hari Hara Veera Mallu : ఓవైపు తగ్గని కుర్ర హీరోలు.. హరిహర వీరమల్లు నిర్మాతల మాస్టర్ ప్లాన్ అదేనా?
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది.

Gossip Garage is that Hari Hara Veera Mallu Producers plan
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. అయితే మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నారట నిర్మాతాలు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా నుంచి పాట ప్రోమో, పాటలు వచ్చేశాయి. ప్రతి కంటెంట్ మీద మార్చి 28న విడుదల అంటూ డేట్ వేస్తూ వస్తున్నారు. కానీ అదే డేట్‌కు వస్తున్న మరో రెండు సినిమాలు నితిన్ రాబిన్ హుడ్, కుర్ర హీరోలు నటించిన మ్యాడ్-2 సినిమాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కంటెంట్ మీద కంటెంట్ వదులుతున్నారు.
హరిహర వీరమల్లు సినిమా విడుదల కావాలంటే కనీసం ఓ వారం రోజులు అయినా పవన్ షూటింగ్‌కు రావాల్సి ఉంటుందట. మూవీ రిలీజ్ సరిగ్గా నెల రోజుల్లో ఉంది. పోనీ మిగిలిన సీన్లన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసేసి, రెడీగా ఉంచుకున్నా, పవన్ సీన్లు యాడ్ చేయాలంటే వారం రోజుల షూట్, మరో వారం రోజుల పోస్ట్ ప్రొడక్షన్..కనీసం 15 రోజులు దానికే పోతాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21 వరకు ఉండే అవకాశం ఉంది.
Sabdham : ‘శబ్దం’ మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్ లో భయపెట్టారుగా..
ఈ టైమ్‌లో పవన్ కల్యాణ్ షూటింగ్‌కు వస్తారా అన్న చర్చ జరుగుతోంది. కచ్చితంగా సినిమా పూర్తి చేసి తీరాలనుకుంటే శని, ఆదివారాలు వర్క్ చేయాలి. అలా మూడు వారాలు వీకెండ్‌లో వర్క్ చేస్తే షూటింగ్ కంప్లీట్ అయ్యే చాన్స్ ఉంటుంది.
పవన్ టైమ్ ఇవ్వకపోవటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడట నిర్మాత. అసెంబ్లీ సమావేశాలు అయిపోయే వరకు..హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ ఇవ్వటం కష్టమేనంటున్నారు. మార్చ్ 28న సినిమా రిలీజ్ అవ్వాలంటే పవన్ డేట్స్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు ప్రీరిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సినిమా విడుదలపై క్లారిటీ లేకపోవటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టాలా వద్దా అన్న డైలమా కొనసాగుతోందట.
Roja – Prabhudeva : ప్రభుదేవాతో కలిసి రోజా మాస్ డ్యాన్స్.. మీనా కూడా.. వీడియో వైరల్..
అయితే పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా కావటంతో.. హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు పార్ట్-2 కూడా ఉందట. కాబట్టి పెండింగ్‌లో ఉన్న సీన్లను పార్ట్-2లో చూపించే ఆలోచన చేస్తున్నారట. ఏది ఏమైనా మార్చి 28న పవన్ సినిమా రిలీజ్ పక్కా అంటున్నారు. నెల రోజుల్లో పెండింగ్ షూటింగ్ కంప్లీట్ అవుతుందా..లేక ఇప్పటివరకు షూట్ చేసిన దాంతోనే సినిమా రిలీజ్ చేస్తారా అన్నది వేచి చూడాలి.