Sabdham : ‘శబ్దం’ మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

టైటిల్ శబ్దం అని పెట్టి సినిమా మొదటి నుంచి చివరి దాకా ఆ శబ్ధాలతోనే భయపెడతారు.

Sabdham : ‘శబ్దం’ మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

Updated On : February 28, 2025 / 12:27 AM IST

Sabdham Movie Review : ఆది పినిశెట్టి, లక్ష్మి మీనన్, సిమ్రాన్, లైలా.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘శబ్దం’. ఆదితో గతంలో వైశాలి లాంటి హిట్ సినిమా తీసిన దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో ఈ శబ్దం సినిమా తెరకెక్కింది. 7G ఫిలింస్ బ్యానర్ నిర్మాణంలో 7G శివ నిర్మాతగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా శబ్దం నేడు ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. ఒక రోజు ముందే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు వేశారు.

కథ విషయానికొస్తే.. ఓ మెడికల్ కాలేజీలో అనుమానాస్పదంగా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు చనిపోతారు. అయితే అక్కడ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయని అంతా అనుకుంటారు. మీడియా, పోలీస్ దాకా వెళ్తే కాలేజీ విలువ దెబ్బ తింటుందని ఓ ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్(పారానార్మల్ ఇన్‌స్పెక్టర్) వ్యూమా(ఆది)ని పిలిపిస్తారు. వ్యూమా మనుషులకు వినపడని శబ్దాలు తన పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడుతూ కేసులు సాల్వ్ చేస్తూ ఉంటాడు.

దీంతో వ్యూమా ఆ కాలేజీలో ఆత్మలు ఉన్నాయా అని పరిశోధన మొదలుపెడతాడు. ఆ కాలేజీలో చదువుతూ జాబ్ చేసే అవంతిక(లక్ష్మి మీనన్)మీద అనుమానం మొదలవుతుంది. అదే సమయంలో మరో అమ్మాయి కూడా చనిపోతుంది. చనిపోయిన ముగ్గురు మధ్యలో కొన్ని కామన్ గా ఉండటం, అవంతికకు కూడా వాటికి లింక్ ఉంది అని వ్యూమాకు అనిపిస్తుంది. వ్యూమా అవంతికపై ఓ ప్రయోగం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ 42 ఆత్మలు ఉన్నట్టు కనిపెడతాడు. మరి ఆ 42 ఆత్మలు ఎవరివి? కాలేజీ స్టూడెంట్స్ ముగ్గురు ఎలా చనిపోయారు? అవంతికకు ఆ చావులకు ఏంటి సంబంధం? వ్యూమా అక్కడ ఆత్మలతో మాట్లాడాడా? ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Roja – Prabhudeva : ప్రభుదేవాతో కలిసి రోజా మాస్ డ్యాన్స్.. మీనా కూడా.. వీడియో వైరల్..

సినిమా విశ్లేషణ.. ఇటీవల ఒక మంచి హారర్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇది పూర్తిస్థాయి హారర్ కాకపోయినా బాగా భయపెట్టారు. ఫస్ట్ హాఫ్ లో కాలేజీలో స్టూడెంట్స్ చనిపోవడం, వ్యూమా రావడం, అవంతికని అనుమానించడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి అక్కడ ఆత్మలు ఉన్నాయని చెప్పే సీన్ తో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ ఆత్మల ఫ్లాష్ బ్యాక్, హీరో ఫ్లాష్ బ్యాక్, హీరో ఆత్మల కోసం పోరాడటంతో ఓ రెగ్యులర్ సినిమాలా సాగుతుంది.

టైటిల్ శబ్దం అని పెట్టి సినిమా మొదటి నుంచి చివరి దాకా ఆ శబ్ధాలతోనే భయపెడతారు. ఫస్ట్ హాఫ్ అయితే ఓ రేంజ్ లో భయపడతారు. ఇది హారర్ కాకపోయినా ప్రతి షాట్ తో భయపెట్టారు. ప్రతి సీన్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయానికి గురిచేస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త నార్మల్ గా స్టోరీ నడిపించి అక్కడక్కడా భయపెడతారు. ఫస్ట్ హాఫ్ ఏదో ఉందని కొత్తగా చూపించి సెకండ్ హాఫ్ లో రెగ్యులర్ స్టోరీలా చేసేసారు. కాస్త కన్ఫ్యూజన్ తో నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో బోలెడన్ని సందేహాలు వస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే సింపుల్ గా సినిమాటిక్ లిబర్టీతో తేల్చేసారు. సినిమాల్లో గబ్బిలాలతో రాసుకున్న సీన్స్ కూడా బాగుంటాయి. శబ్దం సినిమా ముందు నుంచి సాంకేతికంగా బాగుంది అనే వినిపిస్తుంది. ట్రైలర్ చూస్తేనే హాలీవుడ్ లెవల్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమా విజువల్స్, గ్రాఫిక్స్, ముఖ్యంగా సౌండ్ రికార్డింగ్ అన్ని అదిరిపోయాయి. టైటిల్ కి తగ్గట్టు కథ నడిపించి చివర్లో ఓ మెసేజ్ కూడా ఇచ్చారు.

Aadhi Lakshmi Menon Horror Thriller Sabdham Movie Review and Rating

నటీనటుల పర్ఫార్మెన్స్.. పారానార్మల్ ఇన్ స్పెక్టర్ పాత్రలో ఆది చాలా బాగా నటించాడు. అవంతిక పాత్రలో లక్ష్మి మీనన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రెడిన్ కింగ్స్లీ అక్కడక్కడా నవ్విస్తాడు. సిమ్రాన్ పర్వాలేదనిపిస్తుంది. ఒకప్పటి హీరోయిన్ లైలా మాత్రం ఈ సినిమాలో తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Posani : పోసాని ఇంటిపేరుతో ఉన్న హీరో ఎవరో తెలుసా..? మహేష్ బాబుకు చాలా దగ్గరి బంధువు కూడా..

సాంకేతిక అంశాలు.. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో సాంకేతికంగా ది బెస్ట్ అనిపించిన సినిమాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. దర్శకుడు అన్ని విభాగాలను పర్ఫెక్ట్ గా చూసుకొని బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా సౌండ్ రీ రికార్డింగ్ ప్రతి చిన్న డిటైలింగ్ కి క్లారిటీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత తమన్ హారర్ సినిమా బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టి ప్రేక్షకులను భయపడేలా చేసాడు. పాటలు మాత్రం ఒక్కసారి వినగలం అంతే. ప్రపంచంలో రకరకాల శబ్దాలు అంటూ భయపెట్టడానికి ఓ కొత్త పాయింట్ తీసుకొని హారర్ థ్రిల్లర్ కథనంతో రాసుకున్నా క్లైమాక్స్ లో తడబడ్డాడు దర్శకుడు. నిర్మాతలు ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘శబ్దం’ సినిమా శబ్దాలతో ఓ కొత్త కాన్సెప్ట్ రాసుకొని ప్రేక్షకులను భయపెట్టారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.