Roja – Prabhudeva : ప్రభుదేవాతో కలిసి రోజా మాస్ డ్యాన్స్.. మీనా కూడా.. వీడియో వైరల్..

రోజా ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ తో కలిసి ప్రభుదేవా నిర్వహించిన ఈవెంట్ కు హాజరైంది.

Roja – Prabhudeva : ప్రభుదేవాతో కలిసి రోజా మాస్ డ్యాన్స్.. మీనా కూడా.. వీడియో వైరల్..

Roja and Meena Mass Dance with Prabhudeva on stage Videos goes Viral

Updated On : February 27, 2025 / 5:40 PM IST

Roja – Prabhudeva : నటి రోజా రాజకీయాల్లో బిజీ అయ్యాక, మంత్రి అయ్యాక సినిమాలు, టీవీ షోలు అన్ని మానేసింది. సినిమా రిలేటెడ్ ఈవెంట్స్ కూడా బాగా తగ్గించేసింది. గతంలో పలు టీవీ షోలలో కూడా రోజా డ్యాన్స్ లు వేసి అలరించింది. కానీ మంత్రి అయ్యాక అవన్నీ ఆపేసింది. గత ఎన్నికల్లో రోజా ఓడిపోవడం, ప్రభుత్వం కూడా మారడంతో రోజా మళ్ళీ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంది.

ఆల్రెడీ రోజా జీ తెలుగులోని ఓ షోతో టీవీలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఆ షోకి సంబంధించిన ప్రోమోలు ఆల్రెడీ వైరల్ గా మారాయి. ఇటీవల రోజా ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ తో కలిసి ప్రభుదేవా నిర్వహించిన ఈవెంట్ కు హాజరైంది. ప్రభుదేవ చెన్నైలో లైవ్ డ్యాన్స్ కాన్సర్ట్ నిర్వహించాడు. ఈ ఈవెంట్ కు అనేకమంది సినిమా సెలబ్రిటీలు హాజరయ్యారు. మీనా, రంభ, శ్రీదేవి, నగ్మా, సంగీత.. ఇలా అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో కలిసి రోజా కూడా ఈ ఈవెంట్ కు హాజరైంది.

Also Read : Thaman – Siddhartha : సిద్దార్థ్ కి నాకు పడదు.. అతనికి బ్రాండెడ్ సాక్స్.. మాకేమో లోకల్ సాక్స్.. ‘బాయ్స్’ సంఘటనలు చెప్పిన తమన్..

ఈ ఈవెంట్లో ప్రభుదేవాతో కలిసి ధనుష్, వడివేలు.. పలువురు సెలబ్రిటీలు కూడా డ్యాన్స్ లు వేశారు. ఈ క్రమంలో రోజా కూడా ప్రభుదేవాతో కలిసి స్టేజిపై మాస్ డ్యాన్స్ వేసింది. రోజా, మీనా ప్రభుదేవాకు ఇరువైపులా ఉండి తమిళ్ లోని ఓ మాస్ సాంగ్ కి స్టెప్పులు వేశారు. ఈ వీడియోలను అధికారికంగా రిలీజ్ చేయకపోయినా ఈ ఈవెంట్ కు వెళ్లిన ఆడియన్స్ పలు వీడియోలను యూట్యూబ్ లలో పోస్ట్ చేసారు.

 

Also Read : Posani : పోసాని ఇంటిపేరుతో ఉన్న హీరో ఎవరో తెలుసా..? మహేష్ బాబుకు చాలా దగ్గరి బంధువు కూడా..

దీంతో రోజా, మీనా కలిసి ప్రభుదేవాతో డ్యాన్స్ చేసిన వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ వీడియోలు చూసి రోజా ఈజ్ బ్యాక్ అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది, ఈవెంట్ లో డ్యాన్స్ తో అదరగొట్టేసింది. సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.