Thaman – Siddhartha : సిద్దార్థ్ కి నాకు పడదు.. అతనికి బ్రాండెడ్ సాక్స్.. మాకేమో లోకల్ సాక్స్.. ‘బాయ్స్’ సంఘటనలు చెప్పిన తమన్..
తమన్ అప్పుడు జరిగిన పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Music Director Thaman says about his Clash with hero Siddhartha at Boys Movie Time
Thaman – Siddhartha : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన కెరీర్ మొదట్లో బాయ్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరో సిద్దార్థ్ ఫ్రెండ్ పాత్రలో నటించాడు. తాజాగా శబ్దం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్ అప్పుడు జరిగిన పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఇంటర్వ్యూలో డైరెక్టర్ అరివాళగన్ మాట్లాడుతూ.. బాయ్స్ సినిమాలో తమన్ కి అందరికంటే ఎక్కువ పేమెంట్ ఇచ్చారు. ఎవరైనా ఇతన్ని ఏమన్నా అంటే నేనే హైయెస్ట్ పెయిడ్ అనేవాడు అని తెలిపాడు.
దీంతో తమన్ మాట్లాడుతూ.. నాకు సిద్దార్థ్ కి పడదు. సిద్దార్థ్ వచ్చి నా దగ్గర నేనే హీరో అంటే అయితే ఏంటి నాకే ఎక్కువ రెమ్యునరేషన్ నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్ అయితే నాకేంటి, నేను హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అనేవాడ్ని. నాకు రావాల్సిన డబ్బులు, కన్వీనెన్స్ అన్ని పువ్వుల్లో పెట్టి ఇస్తారు. లేకపోతే టార్చర్ పెట్టేవాడిని. సాక్సుల విషయంలో కూడా గొడవ చేసాం. ఒక సారి సిద్దార్థ్ కి నైకీ సాక్స్ తెచ్చి ఇచ్చారు. మాకు ఏమో లోకల్ ఫుట్ వేర్ నైలాన్ సాక్స్ తెచ్చి ఇచ్చారు. దాంతో ఆ సాక్సులు తీసుకెళ్లి నిర్మాత రత్నం గారి టేబుల్ మీద పడేసాను. ఏంటి అని అడిగితే హీరోకి నైకీ సాక్స్, మాకేమో ఇది ఏంటి. అతను చేసిన డ్యాన్స్ మేము కూడా చేస్తున్నాం కదా అని గొడవ పెట్టుకున్నామని తెలిపాడు.
Also Read : Posani : పోసాని ఇంటిపేరుతో ఉన్న హీరో ఎవరో తెలుసా..? మహేష్ బాబుకు చాలా దగ్గరి బంధువు కూడా..
అయితే తమన్ – సిద్దార్థ్ గొడవలు ఆ సినిమా వరకే అని తెలుస్తుంది. ఆ తర్వాత సిద్దార్థ్ చేసిన పలు సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసాడు. గతంలో సిద్దార్థ్ తో కలిసి దిగిన ఫోటో కూడా షేర్ చేసాడు తమన్. ఇక తమన్ చాలా రోజుల తర్వాత శబ్దం అనే హారర్ సినిమాకు పని చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.