Kamakshi Bhaskarla : కెరియర్ లేకుండా చేస్తామన్నారు.. మిస్ ఇండియా పోటీలపై నటి సంచలన వ్యాఖ్యలు
మా ఊరి పొలిమేర టూ పార్ట్స్, విరూపాక్ష వంటి సినిమాల్లో మెరిశారు కామాక్షి భాస్కర్ల. తాజాగా మిస్ ఇండియా పోటీలపై సంచలన కామెంట్స్ చేసారు. తనకు ఎదురైన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నారు ఈ నటి.

Kamakshi Bhaskarla
Kamakshi Bhaskarla : డాక్టర్ టర్న్ డ్ యాక్టర్ కామాక్షి భాస్కర్ల చాలామందికి తెలుసు. చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్న ఈ నటి మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్ వరకు వెళ్లారు. తాజాగా ఈ పోటీలపై కామాక్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Salaar Goes Global : వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ప్రభాస్.. ‘సలార్’ హవా.. RRR తర్వాత మళ్ళీ ఇప్పుడే..
కామాక్షి భాస్కర్ల ఇటీవల మీడియాతో మాట్లాడారు. మిస్ ఇండియా పోటీలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్న కామాక్షికి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలనే కోరిక ఉండేదట. 2018లో ఈ పోటీల్లో పాల్గొనడానికి ఇండియా వచ్చారట. తెలంగాణ నుండి వచ్చిన 50 మంది అమ్మాయిల్లో కామాక్షి మిస్ తెలంగాణాగా ఎంపిక అయ్యారు. ఇక ఫైనల్స్‌లో పార్టిసిపేట్ చేసే క్రమంలో తాను ఎదుర్కున్న అనుభవాలను కామాక్షి షేర్ చేసుకున్నారు. మిస్ తెలంగాణ ఎన్నికైన తర్వాత తనను చబ్బీగా ఉన్నానని, బరువు తగ్గాలని లేదంటే క్రౌన్ వేరేవారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పారట. అయితే తాను ఈ పోటీలపై ఎంతో ఎఫర్ట్ పెట్టి వచ్చానని కష్టపడి బరువు తగ్గుతానని మాట ఇచ్చి వెయిట్ తగ్గారట.
Premalo Review : ‘ప్రేమలో’ మూవీ రివ్యూ.. ప్రేమికులకు అనుకోని కష్టం వస్తే..
ఇక టాప్ 15 వరకు వెళ్లిన కామాక్షికి అక్కడ జరిగిన మరో టాస్క్‌లో టైటిల్ విన్ కాకపోతే ఎలా ఫీలవతావు? అన్న ప్రశ్న ఎదురైందట. ఇదే జీవితం కాదు.. దీని తర్వాత లైఫ్ ఉంది.. మూవ్ ఆన్ అవుతాను అని కామాక్షి స్ట్రాంగ్‌గా చెప్పడం వాళ్లకి నచ్చలేదట. వాళ్లు అడిగిన అగ్రిమెంట్‌పై కామాక్షి సంతకం చేయలేదట. అగ్రిమెంట్ వద్దనుకుని మిస్టేక్ చేస్తున్నావు.. నీకు కెరియర్ లేకుండా చేస్తామని నిర్వాహకులు ఒకరు బెదిరించినట్లు కామాక్షి చెప్పారు. ఓవరాల్‌గా మిస్ ఇండియా పోటీల కోసం తను కష్టపడిన జర్నీ చూసుకుంటే తనకి నచ్చలేదని చెప్పారు కామాక్షి. అందాల పోటీల పేరుతో అగ్రిమెంట్స్ రాయించుకుని మోడలింగ్‌లోకి దింపుతున్నారని చెప్పారు కామాక్షి. ఇక వాటికి స్వస్తి చెప్పి తిరిగి అపోలోలో జాయిన్ అయినా రొటీన్ లైఫ్ బోరు కొట్టి సినిమాలవైపు వచ్చినట్లు చెప్పారు. కామాక్షి ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, మా ఊరి పొలిమేర, రౌడీ బాయ్స్, విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 వంటి సినిమాల్లో నటించారు. జాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ లో కూడా మెరిశారు.