Karate Kalyani: సినిమాలు లేవు, అవకాశాలు లేవు.. బిగ్ బాస్ వల్ల తీవ్రంగా నష్టపోయా.. నేను ఇలా అవడానికి కారణం అదే..

బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి(Karate Kalyani). బిగ్ బాస్ వళ్ళ చాలా నష్టపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

Karate Kalyani: సినిమాలు లేవు, అవకాశాలు లేవు.. బిగ్ బాస్ వల్ల తీవ్రంగా నష్టపోయా.. నేను ఇలా అవడానికి కారణం అదే..

Actress Karate Kalyani made sensational comments on Bigg Boss show.

Updated On : December 11, 2025 / 9:52 AM IST

Karate Kalyani: తెలుగులో అతిపెద్ద రియాలిటీగా చెప్పుకొనే షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. దాదాపు 20 మంది కంటేస్టెంట్స్ ని ఒక ఇంటిలో 100 రోజుల పాటు ఉంచి వాళ్ళ మధ్య చిన్న చిన్న టాస్కులు పెట్టడం, గెలిచినవారికి ట్రోపీ ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇందులోకి వెళ్ళడానికి చాలా మంది సెలబ్రెటీలు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ, కొంతమందికి మాత్రం ఈ షోపై మంచి ఒపీనియన్ ఉండదు. నిజం చెప్పాలంటే, తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం 9వ సీజన్ టెలికాస్ట్ అవుతోంది.

12A Railway Colony OTT: ఓటీటీకి వచ్చేసిన 12ఏ రైల్వే కాలనీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

ఈనేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి(Karate Kalyani). ఈ నటి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చాలా ఏళ్లుగా తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ వస్తోంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టింది కళ్యాణి. కానీ, అనుకోని విదంగా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి బిగ్ బాస్ వళ్ళ చాలా నష్టపోయాను అంటూ చెప్పుకొచ్చింది. చాలా మంది ఈ షో వల్ల లైఫ్ సెటిల్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తుంటే ఈ నటి మాత్రం దానికి విరుద్ధంగా కామెంట్స్ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ లోకి వెళ్లడం వల్ల జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ. అక్కడ వచ్చిన దానికంటే రెండింతలు నష్టపోయాను. ఆ షో అగ్రిమెంట్ వల్ల ఆ అవకాశాలు అన్ని తగ్గిపోయాయి. సినిమాలు లేవు, అవకాశాలు లేవు. దానికి ప్రధాన కారణం నేను బిగ్ బాస్ కి వెళ్లాడమే. బిగ్ బాస్ లోకి వస్తే సినిమా అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్తారు. కానీ, పట్టించుకోలేదు. అది, చాలా బాధగా అనిపించింది. అలా, బిగ్ బాస్ వల్ల నేను ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాను” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో కరాటే కళ్యాణి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతన్నాయి.