12A Railway Colony OTT: ఓటీటీకి వచ్చేసిన 12ఏ రైల్వే కాలనీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?
అల్లరి నరేష్ రీసెంట్ సినిమా '12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony OTT)'. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు నాని కసరగడ్డ తెరకెక్కించగా.. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది.
Allari Naresh 12A Railway Colony movie now streaming on Amazon Prime.
12A Railway Colony OTT: అల్లరి నరేష్ రీసెంట్ సినిమా ’12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony OTT)’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు నాని కసరగడ్డ తెరకెక్కించగా.. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ లాంటి హీరో మొదటి సారి హారర్ కాన్సెప్ట్ లో సినిమా చేయడం, అదికూడా పొలిమేర లాంటి దర్శకుడు ఈ సినిమాకు కథను అందించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ashu Reddy: ఎద గుత్తులతో మత్తెక్కిస్తున్న ఆషు రెడ్డి.. హాట్ ఫోటోలు
కానీ, అనుకున్నంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. రొటీన్ కథ, కథనంతో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దీంతో నెల రోజులు కూడా గడవక ముందే ఈ సినిమాను ఓటీటీకి తీసుకువచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 12ఏ రైల్వే కాలనీ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు వెంటనే అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.
