Actress Kasthuri booked for derogatory remarks against Telugu migrants
తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఆమె క్షమాపణలు చెప్పారు నటి కస్తూరి. క్షపణలు చెప్పినప్పటికి ఆమెకు తిప్పలు తప్పడం లేదు. ఆమెపై చెన్నైలోని ఎగ్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 4 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అఖిల భారత తెలుగు సమాఖ్య(ఏఐటీఎఫ్) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమిళ జాతికి చెందిన వారమని చెప్పుకుంటుంన్నారు అని వ్యాఖ్యానించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
RP Patnaik : వామ్మో ఆర్పీ పట్నాయక్ ఇంత చదువుకున్నారా.. అబ్దుల్ కలాం దగ్గర ఉండాల్సింది..
ఈ క్రమంలో మంగళవారం ఆమె క్షమాపణలు చెప్పారు. తెలుగు ప్రజలు తనకు పేరు, ప్రతిష్ట, కుటుంబాన్ని ఇచ్చారన్నారు. తాను మాట్లాడింది ప్రత్యేకించి కొందరి గురించేనని, అందరి గురించి కాదన్నారు. తెలుగు కుటుంబాలను గాయపరచటం తన ఉద్దేశం కాదన్నారు.
తాను చేసిన ప్రసంగంలో లేవనెత్తిన కొన్ని ముఖ్యమైన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ చర్చ ప్రారంభమైందన్నారు. తమిళనాడులో ఉండే తెలుగు ప్రజలు ఇక్కడి బ్రాహ్మణుల జరిగే పోరాటంలో పాలుపంచుకోవాలని కోరారు.