Actress Kasthuri Shankar find in Hyderabad Police take into Custody
Kasthuri : నటి కస్తూరి ఇటీవల తమిళ నాయకులను విమర్శిస్తూ 300 సంవత్సరాల క్రితం తమిళ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్ళే తెలుగు వాళ్ళు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ద్రవిడ సిద్ధాంత వాదులపై ఫైర్ అవుతూ బ్రాహ్మణులకు సపోర్ట్ గా మాట్లాడుతుండగా అనుకోకుండా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి వివాదాస్పదంగా మారాయి. దీంతో పలుచోట్ల కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ విషయంలో కస్తూరి క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.
కస్తూరి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా దానిని హైకోర్టు కొట్టేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లగా ఆమె ఇంటికి తాళం వేసింది. మొబైల్ సైతం స్విచ్ఛాప్‌లో ఉండటంతో ఆమె పరారీలో ఉందని పోలీసులు భావించి ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు.
కస్తూరి ఏపీలో ఉందని తెలియడంతో చెన్నై పోలీస్ కమిషన్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపారు. తాజాగా నటి కస్తూరి గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసు విషయంలో ఆమెను చెన్నై తరలించి విచారించనున్నారు.