Pushpa 2 : బాబోయ్.. బీహార్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హడావిడి.. రేపు ట్రైలర్ రిలీజ్ అయితే ఇవాళ్టి నుంచే సందడి..

బీహార్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పట్నుంచే హంగామా మొదలుపెట్టారు.

Pushpa 2 : బాబోయ్.. బీహార్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హడావిడి.. రేపు ట్రైలర్ రిలీజ్ అయితే ఇవాళ్టి నుంచే సందడి..

Allu Arjun Fans Rushed to Patna Event Ground for Pushpa 2 Trailer Launch Event

Updated On : November 16, 2024 / 8:30 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రేపు బీహార్ రాజధాని పాట్నాలో గ్రాండ్ గా జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓపెన్ గ్రౌండ్ ను రేపటి ఈవెంట్ కోసం భారీగా సిద్ధంచేస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బీహార్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పట్నుంచే హంగామా మొదలుపెట్టారు.

Also Read : Ram Charan : చరణ్ మొదటి సారి అయ్యప్ప మాల వేసినప్పుడు.. చిరంజీవి గారు మాకు అప్పచెప్తూ.. పరుచూరి కామెంట్స్..

అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైల‌ర్ లాంచ్ పాస్ ల కోసం పాట్నాలో మైధానం వ‌ద్ద భారీగా అభిమానులు క్యూ కట్టారు. ఏకంగా దాదాపు 25 వేల మంది మ‌ధ్య‌లో పాట్నాలో ట్రైల‌ర్ లాంచ్‌ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. దేశంలో అన్ని రాష్ట్రాల నుండి ఐకాన్ స్టార్ అభిమానులు పాట్నాకి ట్రైల‌ర్ లాంచ్ కోసం చేరుకుంటున్నారు. పాట్నాలో గాంధి మైధాన్ ద‌గ్గ‌ర హోట‌ల్స్‌, లాడ్జీల‌లొ రూమ్స్ కొసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈవెంట్ ఏర్పాట్ల‌ని, మైదానం ద‌గ్గ‌ర అభిమానుల క్రేజ్ ని నేష‌న‌ల్ మీడియా మీడియా కవర్ చేసింది.

రేపు సాయంత్రం ట్రైలర్ లాంచ్ అయితే ఇవాళ్టి నుంచే ఈవెంట్ జరిగే స్థలంలో ఫ్యాన్స్ హంగామా చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. బీహార్ లో కూడా అల్లు అర్జున్ హవా నడుస్తుందిగా అని ఫీల్ అవుతున్నారు. పుష్ప 2 ఈవెంట్ జరిగే ప్లేస్ వద్ద ఫ్యాన్స్ హంగామా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రేపటి ఈవెంట్ ఏ రేంజ్ లో జరగబోతుందో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నేషనల్ వైడ్ పుష్ప 2 తో బన్నీ మరింత క్రేజ్ తెచ్చుకోబోతున్నాడు.