Ram Charan : చరణ్ మొదటి సారి అయ్యప్ప మాల వేసినప్పుడు.. చిరంజీవి గారు మాకు అప్పచెప్తూ.. పరుచూరి కామెంట్స్..
తాజాగా రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోలో రామ్ చరణ్ గురించి, చరణ్ అయ్యప్ప మాల మొదటి సారి వేసినప్పటి సంగతి మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలిపారు.

Paruchuri Gopalakrishna Interesting Comments about Ram Charan First Time Ayyppa Deeksha
Ram Charan : మన సినీ పరిశ్రమలో కూడా చాలా మంది సెలబ్రిటీలు రెగ్యులర్ గా అయ్యప్ప మాల వేస్తారని తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉంటారు. రామ్ చరణ్ కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు. అయితే తాజాగా రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోలో రామ్ చరణ్ గురించి, చరణ్ అయ్యప్ప మాల మొదటి సారి వేసినప్పటి సంగతి మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలిపారు.
పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. 2002 సంవత్సరంలో మేము అయ్యప్ప దీక్ష తీసుకొని వెళ్తున్నాము. అప్పుడు చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి చరణ్ బాబుని చూపించి తను కూడా మాల వేసుకున్నాడు. మొదటిసారి కన్నెస్వామి. మీకు అప్పచెప్తున్నాను జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురండి అన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ కార్ లో వెళ్లి వరంగల్ నుంచి ట్రైన్ లో చెంగనూర్ ఆ తర్వాత శబరిమల దర్శనం చేసుకొని తిరిగి రావాలి. చిరంజీవి గారు చరణ్ ని మాకు అప్పచెప్తూ జాగ్రత్త చిరంజీవి గారబ్బాయి అని ఎవ్వరికి తెలియకూడదు అని చెప్పారు. అప్పుడే ఫస్ట్ పరిచయం నాకు చరణ్. ఇక్కడి నుంచి శబరి వెళ్లి తిరిగొచ్చేలోపు ఒక నాలుగైదు మాటలు మాట్లాడడేమో అంతే. ఏం అడిగినా నవ్వేవాడు. మాకు భోజనాలు తెచ్చి ఇచ్చేవాళ్ళు కొన్ని ఊర్లల్లో ట్రైన్ ఆగినప్పుడు అప్పుడు చరణ్ కిటికీ నుంచి బయటకు చూసేవాడు మాకు భయం వేసేది ఎవరన్నా గుర్తుపడతారేమో అని. కొండ ఎక్కేముందు కూడా ఎక్కగలవా అని అడిగితే సింపుల్ గా నవ్వాడు. అయ్యప్ప మాలలో ఒక కన్నెస్వామిగా మాకు పరిచయం అయి అయ్యప్పలతో కలిసి వచ్చిన ఆ రామ్ చరణ్ జ్ఞాపకం నేను మర్చిపోలేను. మెగాస్టార్ కొడుకు అని కూడా లేకుండా సింపుల్ గా అందరితో కలిసి ఉండేవాడు అప్పట్నుంచే అని అన్నారు. దీంతో పరుచూరి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ మొదటిసారి మాల వేసుకొని పరుచూరిని కలిసిన ఫోటో కూడా ఒకటి షేర్ చేసారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక చరణ్ రెగ్యులర్ గా మాల వేస్తాడని తెలిసిందే. ఇప్పుడు కూడా చరణ్ మాలలోనే ఉన్నారు. ఇటీవల గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చరణ్ అయ్యప్ప మాలలోనే కనిపించారు.