Nainisha Roy : కమిట్ మెంట్ అడిగి ఇబ్బంది పెట్టారు.. రక్తం అమ్ముకుని కడుపు నింపుకోవాల్సి వచ్చింది.. నటి సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ సీరియల్ నటి నైనిష రాయ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. నైనిష చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Nainisha Roy : కమిట్ మెంట్ అడిగి ఇబ్బంది పెట్టారు.. రక్తం అమ్ముకుని కడుపు నింపుకోవాల్సి వచ్చింది.. నటి సంచలన వ్యాఖ్యలు

Nainisha Roy

Updated On : February 20, 2024 / 12:03 PM IST

Nainisha Roy : బెంగాలీ అమ్మాయి అయిన నైనిషా రాయ్ తెలుగు ఇండస్ట్రీ మీద ఆసక్తితో ఇటు వచ్చారు. ‘బ్రహ్మముడి’ సీరియల్ చూసినవారు నైనిషను గుర్తు పట్టేస్తారు. వరుస పెట్టి సీరియల్స్ చేసిన ఈ నటి ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. కుటుంబానికి కూడా దూరమైన నైనిష తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న విషయాలు అందర్నీ షాక్‌కి గురి చేశాయి.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సినిమాల మీద ఉన్న ఆసక్తి నటి నైనిష రాయ్‌ను కుటుంబానికి దూరం చేసింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైనిష తండ్రి లెక్చరర్ కాగా, తల్లి హౌస్ వైఫ్ అట. వాళ్లకి తను ఇండస్ట్రీలోకి రావడం అస్సలు ఇంట్రెస్ట్ లేదట. అలా కుటుంబం వదిలేసి నైనిష ఇండస్ట్రీ వైపు అడుగులు వేసారు. బ్రహ్మముడి అనే సీరియల్‌లో అప్పు పాత్రతో  నైనిష మంచి మార్కులు కొట్టేసారు. కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం, శ్రీమంతుడు వంటి సీరియల్స్‌లో నటించారు. కాగా ఈ నటి ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Vishwak Sen : ఆ నటుడు చేసిన పని వల్ల నాకు చాలా నష్టం జరిగింది

ఇండస్ట్రీకి వెళ్తాను అంటే ఏ ఫ్యామిలీ అమ్మాయిలను యాక్సెప్ట్ చేయదని అన్నారు నైనిష. అందుకే తన కుటుంబం తనకు దూరమైందని చెప్పారు. ఇండస్ట్రీలో కమిట్ మెంట్ అనేది ఎక్కువగా ఉందని.. ఒక ప్రాజెక్టు విషయంలో రెండు రోజుల్లో షూటింగ్ అనగా మేనేజర్ కమిట్ మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడని నైనిష అన్నారు. తను కుదరదు అన్నందుకు తనను చాలా ఇబ్బందికి గురి చేసారని చెప్పారు. తన పరిస్థితి దారుణంగా మారిపోయి చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని .. ఆఖరికి తినడానికి తిండి లేక బ్లడ్ డొనేట్ చేసి వచ్చిన డబ్బులతో  కడుపు నింపుకున్నానంటూ నైనిష చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Nainisha (@nainisha_rai)