Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 21న పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ నటి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Rakul Preet Singh

Updated On : February 20, 2024 / 11:24 AM IST

Rakul Preet Singh : ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. మొదట మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ తన కెరియర్‌లో అందుకున్న మొదటి పారితోషికం గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Vishwak Sen : ఆ నటుడు చేసిన పని వల్ల నాకు చాలా నష్టం జరిగింది

2013లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రకుల్ వరుస పెట్టి లౌక్యం, పండగ చేస్కో, సరైనోడు,ధృవ, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ వంటి సినిమాల్లో నటించారు. 2014 లో ‘యారియాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నటి ప్రస్తుతం బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టారు. కాగా ఫిబ్రవరి 21న తన ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడబోతున్నారు. గోవాలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ క్రమంలోనే రకుల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.

Miss World 2024 : మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి భారత్ నుండి బరిలోకి దిగుతున్న బ్యూటీ ఎవరో తెలుసా?

రకుల్ తన కెరియర్ ప్రారంభంలో మోడల్‌గా అందుకున్నతొలి పారితోషికం గుర్తు చేసుకున్నారు. రూ.5 వేలు రకుల్ మొదటి రెమ్యునరేషన్ అట.  ఈరోజు తాను ఈ స్ధాయికి రావడానికి తన పేరెంట్స్, సన్నిహితులే కారణమని రకుల్ చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర్నుండి ఈరోజు వరకు వాళ్లే తన వెన్నంటి ఉన్నారని చెప్పారు. వాళ్లే లేకపోతే తాను ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. రకుల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రకుల్ నటించిన అయలాన్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఇండియన్ 2 లో నటిస్తున్నారు.