Actress Nandita Swetha : హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం

వర్ధమాన నటి నందితా శ్వేత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శ్రీశివస్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు.

Actress Nandita Swetha : హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం

Nandita Swetha

Updated On : September 20, 2021 / 1:38 PM IST

Actress Nandita Swetha : వర్ధమాన నటి నందితా శ్వేత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శ్రీశివస్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. ఈవిషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియ చేశారు.” నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్నీ తెలియజేయాలనుకున్నాను” అని ట్వీట్ చేసింది నందిత.

Also Read : Sexually Harassment : ఓ ముద్దివ్వు….రూ.25 వేలు ఇస్తా… డాక్టర్‌కు పేషెంట్ బంపర్ ఆఫర్

సమచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నందిత దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు నటిస్తోంది. కన్నడ చిత్రం “నంద లవ్స్ నందిత” చిత్రంతో నందిత తన సినీ కెరీర్ ప్రారంభించింది. తరువాత 2012లో కామెడీ చిత్రం “అట్టకతి”తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2016 లో హారర్ కామెడీ చిత్రం “ఎక్కడికి పోతావు చిన్నవాడ”తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది