Natti Karuna : ఫిట్నెస్ ట్రైనర్ ను పెళ్లి చేసుకున్న నటి.. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకొని ఇప్పుడు ఫోటోలు షేర్ చేసి..
తాజాగా కరుణ తన పెళ్లి, నిశ్చితార్థం ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Actress Producer Natti Karuna Married Fitness Trainer Photos goes Viral
Natti Karuna : ఆర్జీవీతో ఎక్కువ సినిమాలు చేసిన నిర్మాత నట్టి కుమార్ రెగ్యులర్ గా పాలిటిక్స్, ఇండస్ట్రీ విషయాలు మాట్లాడి వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. నిర్మాతగా, దర్శకుడిగా ఈయన పలు సినిమాలు తీశారు. ఈయన కూతురు నట్టి కరుణ కూడా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అలాగే హీరోయిన్ గా దెయ్యంతో సహజీవనం అనే సినిమాలో కూడా నటించింది.
ఇటీవల నెల రోజుల క్రితం నట్టి కరుణ వివాహం అయింది. తాజాగా కరుణ తన పెళ్లి, నిశ్చితార్థం ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరుణ నిఖిల్ గూడిరి అనే ఫిట్నెస్ ట్రైనర్ ని వివాహం చేసుకుంది. నిఖిల్ ఫిట్నెస్ ట్రైనర్ గా, న్యూట్రీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. నిఖిల్ – కరుణ ఇద్దరూ కలిసి తమ పెళ్లి ఫోటోలు షేర్ చేసి.. పెళ్లి జరిగి నెల రోజులు అయిందని, వన్ మంత్ యానివర్సరీ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు.
ఇక వీరు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే.. వీరిది ప్రేమ వివాహం అని, నెల రోజుల క్రితం హైదరాబాద్ లోని ఆవాసా హోటల్ లో కేవలం ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్యే పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. పలువురు ప్రముఖులు, ఫాలోవర్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నట్టి కరుణ – నిఖిల్ పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి.