Air Hostess To Actress- రాశి సింగ్..

Actress Rashi Singh: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి హీరోయిన్ అయిన భామ రాశి సింగ్. మంచి అభినయంతో చక్కటి నటన తో అందరిని ఆకట్టుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
అంతే కాదండోయ్.. అప్పుడే తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకుంది ఈ చత్తీస్‌ఘర్ కుందనపు బొమ్మ. అయితే విజయ్ రాజాతో జేమ్, ఆది సాయి కుమార్ తో శశి, సాయి రామ్ శంకర్ అండ్ అరవింద్ కృష్ణ తో రిసౌండ్, అఖిల్ రెడ్డితో పోగరున్నోడు వంటి వసుస సినిమాలు చేస్తున్న రాశి సింగ్ తాజాగా మరో కొత్త హీరోతో ఒక తెలుగు సినిమాతో పాటు మరో మలయాళం సినిమా కూడా సైన్ చేసింది.
పొరుగు రాష్ట్రాల భామలు అయినా సరే తెలుగు భాష నేర్చుకుని, నటన పట్ల ఆసక్తి ఉంటే తక్కువ టైమ్‌లొనే మంచి హీరోయిన్‌గా ఫాం లోకి రావడం ఈజీ అని మరోసారి ఋజువు చేసింది రాశి సింగ్.