సమంత సంచలన నిర్ణయం.. తెలుగు నిర్మాతలకు షాక్

సమంత తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్ లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయట.

Samantha

నటి సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారా? ఇక నుంచి హీరోలతో పాటు తనకు కూడా సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అని కండీషన్ పెట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోందట సినీవర్గాల్లో. ఇంతకీ సమంత ఎందుకంతలా కఠిన నిర్ణయం తీసుకున్నారు? మరి సమంత చెప్తున్నట్లుగా తెలుగు నిర్మాతలు ఆమెకు హీరోకు ఈక్వెల్ రెమ్యునేషన్ ఇచ్చేందుకు ఒప్పుకుంటారా?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ సమంత తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆమె తెలుగు సినిమాల్లో నటించాలంటే, హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని స్పష్టంగా చెప్పిందట.

Also Read: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్… పెరిగిన ఛార్జీలు.. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

లేదంటే, ఏ కథ ఎంత గొప్పగా ఉన్నా ఆమె కాల్షీట్ ఇవ్వదట. ఇప్పటికే పలువురు నిర్మాతలతో జరిగిన ప్రాథమిక చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేసిందట సమంత. ఒక సినిమా విజయానికి కేవలం హీరో మాత్రమే కారణం కాదని..హీరోయిన్ పాత్ర కూడా సమానంగా ఉంటుందని..ఆ కృషికి తగిన గౌరవం కావాలని సమంత అంటోందట.

కొద్ది కాలంగా గ్లోబల్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు వెబ్ సిరీస్ లతో తన రేంజ్ ను పెంచుకున్న సమంత,.ఇప్పుడు సినిమాల్లో కూడా అదే లెవెల్ మెయింటైన్ చేయాలని డిసైడ్ అయ్యిందట. ఈ క్రమంలోనే ఆమె సొంత నిర్మాణ సంస్థలో తన బేనర్ పై తెరకెక్కే సినిమాల్లో కూడా నటీ నటులకు సమాన పారితోషికం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందట.

అయితే సమంత తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్ లో మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయట. కొందరు నిర్మాతలు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఆలోచనలో పడిపోయారట. అయితే సమంత మాత్రం తాను తీసుకున్న స్టాండ్ నుండి వెనక్కి తగ్గేలా కనిపించదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. సమంత మాట అంటే మాటే అని..వెనక్కి తగ్గరని అంటున్నారు.