ఆ బడాబాబులే.. అంతా నా కర్మ.. సంజన బోరున ఏడ్చేసింది!

Sandalwood actress Sanjana Galrani : డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శాండల్‌వుడ్ హీరోయిన్ సంజనా గల్రాని బోరున ఏడ్చేసింది.. ఏంటి నాకు ఈ కర్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. భోజనం కూడా చేయడం లేదంట.. ఎందుకిలా జరిగిందంటూ సంజన ఏడ్చేస్తుందంట.. సంజనతో పాటు మరో నటి రాగిణి ద్వివేది కూడా ఉంది..
డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో వీరిద్దరూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం.. బెంగళూరులో డైరీ సర్కిల్‌లోని మహిళా సాంత్వన కేంద్రంలో ఉంచారు. వీరిద్దరిని ఒకే గదిలో ఉంచారు.. వీరిద్దిరి మధ్య ఎలాంటి మాటలు లేవు.. కేపీఎల్ విభేదాలతో రాగిణి, సంజన మాట్లాడుకోవడం లేదంట..
https://10tv.in/class-12-dropout-hacks-instagram-accounts-of-minor-girls-forces-them-to-send-nude-videos/
మరోైపు డ్రగ్స్ కేసులో రాగిణి, సంజనా పేర్లను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారని మరో నటి పారూల్ యాదవ్ విమర్శించారు. వారికి మద్దతుగా ఆమె నిలిచారు. దేశంలో డ్రగ్స్‌ను వాడేది, అమ్మేది వీరేనా ఇంక ఎవరూ ఈ కేసులో లేరా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇతర రంగాల ప్రముఖులు, సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో లేరా? అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయానికి సంజన, రాగిణిని తీసుకెళ్లారు.. అక్కడే వారిద్దరిని సీసీబీ విచారించింది. రాగిణి ద్వివేదిని మహిళా సీఐ కాత్యాయని ప్రశ్నించారు. నిందితుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో కొన్ని వివరాలపై సంజనాను విచారించారు. 34 మంది బడా బాబుల కుమారుల పేర్లను సంజనా సీసీబీకి వెల్లడించిన్నట్లు తెలిసింది.
సంజన మాటల్లో ఎంత వాస్తవం ఉందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.. ఇందులో ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల కుమారులు ఉన్నారని సమాచారం.. సంజనా, రాగిణి వాంగ్మూలాలను పోలీసులు రికార్డ్ చేశారు.