Nara Bhuvaneswari : హ్యాపీ బర్త్ డే పెద్ద అత్తయ్య.. సీఎం చంద్రబాబు భార్యకు హీరోయిన్ స్పెషల్ విషెస్..

ఓ హీరోయిన్ నారా భువనేశ్వరికి స్పెషల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

Actress Siree Lella Birthday wishes to Nara Bhuvaneswari

Nara Bhuvaneswari : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పుట్టినరోజు. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ నారా భువనేశ్వరికి స్పెషల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాలో నటించిన హీరోయిన్ సిరి లేళ్ల రోహిత్ తో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం చివర్లో నారా రోహిత్ – సిరి పెళ్లి వేడుక జరగనున్నట్టు సమాచారం.

Also Read : Klin Kaara : పులి పిల్లకు చరణ్ కూతురు ‘క్లిన్ కారా’ పేరు.. ఉపాసన స్పెషల్ పోస్ట్ వైరల్..

నిశ్చితార్థంలో నారా భువనేశ్వరి సిరిని ఆశీర్వదిస్తున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే పెద్ద అత్తయ్య అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నారా రోహిత్ సీఎం చంద్రబాబు అన్న కొడుకు అని తెలిసిందే. ఈ క్రమంలో సిరికి నారా భువనేశ్వరి అత్తయ్య అవుతుంది. గతంలో చంద్రబాబు పుట్టిన రోజుకు కూడా మామయ్య అంటూ శుభాకాంక్షలు తెలిపింది.

 

Also Read : Laya : చూడ్డానికి చదువుకున్నవాడిలా ఉన్నాడు.. సినిమాల్లోకి ఎందుకు? త్రివిక్రమ్ గురించి లయ..