Klin Kaara : పులి పిల్లకు చరణ్ కూతురు ‘క్లిన్ కారా’ పేరు.. ఉపాసన స్పెషల్ పోస్ట్ వైరల్..
పులిపిల్లతో ఉపాసన, క్లిన్ కారా కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి..

Hyderabad Zoo Park Named a Tiger Kid with Klin Kaara Upasana Shares Special Post
Klin Kaara : గతంలో హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఓ పులి పిల్లను ఉపాసన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వాటి సంరక్షణకు ఆమె అవసరమైన నిధులను జూ పార్క్ కి అందిస్తున్నారు. తాజాగా ఉపాసన ఆ పులి పిల్లలను తన కూతురు క్లిన్ కారాతో వెళ్లి కలిసింది. ఈ మేరకు ఆ పులిపిల్లతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికర విషయం తెలిపింది.
పులిపిల్లతో ఉపాసన, క్లిన్ కారా కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. సంవత్సరం క్రితం ఇది ఒక చిన్న పులిపిల్ల. ఇప్పుడు ఆడుకునే ఆడపులిగా మారింది.అలాగే క్లిన్ కారా పేరును పంచుకుంది. ఇందుకు హైదరాబాద్ జూ పార్క్ నిర్వాహకులకు ధన్యవాదాలు. మనం అడవి జంతువులు అడవికి మాత్రమే చెందినవి అని భావిస్తాం. కానీ వాటికి సపోర్ట్ చేసి అవి గౌరవంగా బతికేలా చూసుకోవాలి అని తెలిపింది.
Also Read : Kuberaa : ‘కుబేర’ మూవీ రివ్యూ.. ఓ బిచ్చగాడి చుట్టూ తిరిగే కథ..
దీంతో ఆ పులి పిల్లకు జూ నిర్వాహకులు క్లిన్ కారా అనే పేరు పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఆ పులిపిల్లలకు కావాల్సిన నిధులను మరోసారి జూ నిర్బహకులకు అందచేసింది ఉపాసన. దీంతో చరణ్ ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు ఉపాసనను అభినందిస్తున్నారు.
Also Read : Kuberaa : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ – నాగార్జున సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?