Kuberaa : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ – నాగార్జున సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?

ఇప్పటికే ఓవర్సీస్ లో పలు చోట్ల సినిమా పడగా ఆడియన్స్ తమ రివ్యూలను ట్విట్టర్లో పంచుకుంటున్నారు.

Kuberaa : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్ – నాగార్జున సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?

Nagarjuna Dhanush Rashmika Mandanna Sekhar Kammula Kuberaa Movie Twitter Review

Updated On : June 20, 2025 / 7:36 AM IST

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాని భారీగా నిర్మించారు. కుబేర సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పాన్ ఇండియా వైడ్ నేడు జూన్ 20న రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో పలు చోట్ల సినిమా పడగా ఆడియన్స్ తమ రివ్యూలను ట్విట్టర్లో పంచుకుంటున్నారు.

సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని, ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు.

శేఖర్ కమ్ముల మరోసారి హిట్ కొట్టాడని, ఒక కొత్త కథని అద్భుతంగా చూపించాడని అంటున్నారు.

సినిమాకు అందరూ 3 లేదా అంతకంటే ఎక్కువే రేటింగ్ ఇస్తుండటం గమనార్హం.